అయోధ్య బాలరాముడికి 1,11,111 కేజీల లడ్డూలు!

Ayodhya Ram Temple: అయోధ్య లో రామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా రామ నవమి వేడుకలు ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Ayodhya Ram Temple: అయోధ్య లో రామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా రామ నవమి వేడుకలు ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హింధువులు గర్వించే విధంగా జగదభిరాముడు జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. జనవరి 22, సోమవారం ఉదయం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. మరుసటి రోజు నుంచి బాలరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతిరోజూ లక్షల మంది బాలరాముడి దర్శనం కోసం అయోధ్యకు తరలి వెళ్తున్నారు. కోట్ల మంది భక్తులు రామ్ లల్లాకు రక రకాల కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా బాల రాముడికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది అయోధ్యలో హిందువులు గర్వించే విధంగా రామ మందిరం నిర్మాణం జరిగి బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిపించారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ప్రాణ ప్రతిష్ట అనంతరం నిత్యం బాలరాముడిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. రామ మందిరంలో బాల రాముడిని ప్రతిష్ట తర్వాత తొలిసారిగా వస్తున్న శ్రీరామ నవవి అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాల రాముడికి అనేక ప్రాంతాల నుంచి రక రకాల కానుకలు వస్తున్న విషయం తెలిసిందే. రామ నవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్య రామాలయానికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవ్ రహ హన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు.

కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన తెలిపారు.  జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రోజున దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం వారు 40 వేల కిలోల లడ్డూను నైవేద్యంగా పంపినట్లు తెలిపారు. ఏప్రిల్ 17 న శ్రీ రామనవమి సందర్బంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలు తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటపుడు, అలంకారం చేసేటపుడు మాత్రమే తలుపులు మూసి వేయనున్నట్లు పూజారులు తెలిపారు. ఇదిలా ఉంటే రామ నవమి సందర్భంగా లక్షల సంఖ్యల్లో అయోధ్యకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Show comments