SNP
రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులన్నీ బంద్ ఉండనున్నాయి. దాదాపు 48 గంటల పాటు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో వాహనదారులు కంగారు పడుతున్నారు. మరి ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులన్నీ బంద్ ఉండనున్నాయి. దాదాపు 48 గంటల పాటు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో వాహనదారులు కంగారు పడుతున్నారు. మరి ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక్క రోజు పెట్రోల్ దొరకకుంటే.. నగరాల్లో జనజీవనం స్థంభించిపోతుంది. చాలా వాహనాలు ఎక్కడివి అక్కడు నిలిచిపోతాయి. బండ్లో ఉన్న పెట్రోల్‌తోనే మ్యానేజ్ చేయాల్సి వస్తుంది. బంకుల్లో పెట్రోల్ దొరకదని తెలిస్తే.. వాహనదారులంతా కంగారుపడిపోతారు. ఎందుకంటే.. పెట్రోల్ అలా నిత్యవసరమైపోయింది. బైకుల్లో కార్లలో ఆఫీస్‌లకు వెళ్లేవారికి పెట్రోల్ బంకులు పనిచేయడం ఎంతో ముఖ్యంగా బంక్ మూసి ఉంటే.. వారి పని ఇక అంతే.. ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సిందే. అలాంటిది ఏకంగా రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ ఉంటే.. వామ్మో ఇంకేమైనా ఉందా? ఆ పరిస్థితిని ఊహించలేం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. ఒక్క పూట బంకులన్నీ బంద్ ఉన్నా.. నరకం చూడాల్సిందే. అలాంటి ఏకంగా రెండు రోజుల పాటు బంకులన్నీ మూతపడనున్నాయి.
వామ్మో మూడు రోజులు బంకులు మూతపడతాయా? అంటే ఈ మూడు రోజులు మనకు పెట్రోల్ దొరకదా? అని కంగారు పడకండి. ఈ పెట్రోల్ బంకుల బంద్ మన దగ్గర కాదులేండీ. రాజస్థాన్ రాష్ట్రంలో. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఇప్పటికే బంకులన్నీ మూత పడ్డాయి. ఎక్కడా కూడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో.. వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఈ బంద్ గురించి తెలిసి ఇళ్లకే పరిమితం అయ్యారు. అసలు ఈ బంద్ ఎందుకంటే..
రాజస్థాన్ పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ఓ రెండు రోజుల స్ట్రైక్ పాటిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్(వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్)ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. డీలర్స్ అసోసియేషన్ వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెట్రోల్ బంక్‌కు కూడా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి తెరుచుకోలేదు. దీంతో చాలా మంది వాహనదారులు ఈ బంద్ గురించి తెలిసి బండ్లను బయటికి తీయలేదు. ఈ బంద్ 48 గంటల పాటు సాగునుంది. మరి ఈ పెట్రోల్ బంకుల బంద్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | Fuel pumps in Jaipur wear a deserted look as the Rajasthan Petroleum Dealers Association begins its two-day strike, demanding a reduction in value-added tax (VAT) levied on petrol and diesel.
The strike began from 6 am today and will continue till 6 am on March 12. pic.twitter.com/pFtEuvtJ72
— ANI (@ANI) March 10, 2024