కృష్ణాలయం నిర్మించే వరకు ఒకపూటే ఆహారం.. ప్రతిజ్ఞ చేసిన మంత్రి!

Krishna Temple: సోమవారం అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఇక అయోధ్య మందిరం పూర్తైన తరువాత మథురలోని కృష్ణాలయంపై అందరి దృష్టి మళ్లీంది. అందుకు కారణం ఓ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిజ్ఞ.

Krishna Temple: సోమవారం అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఇక అయోధ్య మందిరం పూర్తైన తరువాత మథురలోని కృష్ణాలయంపై అందరి దృష్టి మళ్లీంది. అందుకు కారణం ఓ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిజ్ఞ.

సోమవారం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సం ఘనంగా జరిగింది. బాల రాముడు తన నివాసంలో కొలువుదీరడంతో ఐదు శతాబ్దాల హిందువుల కల నెరవేరింది. దేశవ్యాప్తంగా రామనామస్మరణతో గ్రామాలు దద్దరిల్లాయి. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో..దాని కోసం పోరాటం చేసిన వారు ఇక నుంచి మథురలోని శ్రీకృష్ణుని మందిరం నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఉపవాస దీక్షలు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి తాజాగా ఒక ప్రతిజ్ఞ చేశారు.  మథురలో శ్రీకృష్ణ ఆలయం జరిగేవరకు తాను రోజుకు ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మదన్ దిలావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్టుడి గుడి నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటానని శపథం చేశారు. ఈ మదన్ దిలావర్ ఇలా శపథం చేయడం తొలిసారి కాదు. గతంలో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కూడా ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని.. అప్పటివరకు మెడలో పూల దండలు వేసుకోనని.. కొన్నేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగడంతో మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ తీరిపోయింది. దీంతో మదన్ దిలావర్ అభిమానులు.. ఆయన మెడలో భారీ గజమాల వేశారు.

ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. రాజకీయాల్లోకి రాకముందు ఆరెస్సెస్ లో సభ్యుడిగా పని చేశారు. ఆ సమయంలోనే అయోధ్య నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామ్‌ గంజ్ మండి సిటీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే పూల దండను ధరించి దీక్షను విరమించారు. దాదాపు 34 కిలోల బరువు ఉన్న గజ మాలను బీజేపీ కార్యకర్తలు ముందుగా శ్రీరాముడికి సమర్పించారు. అనంతరం అదే మాలను రాముడి దీవెనగా మంత్రి మదన్ దిలావర్ మెడలో వేశారు. అయితే మదన్ దిలావర్ ఇప్పటివరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. అన్ని సార్లు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కూడా రామ మందిరం కోసం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఏ సందర్భంలో  కూడా మెడలో పూలమాల వేసుకోలేదు.

ఇటీవల రాజస్థాన్ లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేళ నిర్వహించిన ర్యాలీలో మదన్ దిలావర్ ఢమరుకం వాయించారు. ఈ క్రమంలోనే తన కరసేవ జ్ఞాపకాలను మదన్‌ దిలావర్‌ వివరించారు. తాజాగా మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణంపై మరో ప్రతిజ్ఞ చేశారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంట్లో భోజనం చేసిన మదన్ దిలావర్.. ఆమెకు ఒక చీర, రూ.51 వేలు కానుకగా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాలయ నిర్మాణం జరిగే వరకు ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తాని శపథం చేశారు. మరి.. ఆలయాల నిర్మాణం కోసం కఠినమైన ప్రతిజ్ఞలు చేస్తున్న ఈ మంత్రిపై మీ అభిప్రాయలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments