iDreamPost
android-app
ios-app

మహిళను మోసం చేసిన గుజరాత్ వ్యాపారి! రూ.300 విలువ చేసే నగలను రూ.6 కోట్లుకు అమ్మి!

  • Published Jun 11, 2024 | 6:57 PMUpdated Jun 11, 2024 | 6:57 PM

ఇటీవలే ఓ మహిళను బకారా చేసిన ఓ నగల వ్యాపారి  పెద్ద ఎత్తునే మోసం చేశాడు. నాణ్య‌మైన బంగారు న‌గ‌ల‌పేరుతో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయ‌ల‌ దోపిడికి పాల్ప‌డ్డాడు. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవలే ఓ మహిళను బకారా చేసిన ఓ నగల వ్యాపారి  పెద్ద ఎత్తునే మోసం చేశాడు. నాణ్య‌మైన బంగారు న‌గ‌ల‌పేరుతో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయ‌ల‌ దోపిడికి పాల్ప‌డ్డాడు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 11, 2024 | 6:57 PMUpdated Jun 11, 2024 | 6:57 PM
మహిళను మోసం  చేసిన గుజరాత్ వ్యాపారి!  రూ.300 విలువ చేసే నగలను రూ.6 కోట్లుకు అమ్మి!

బంగారం అంటే ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే మహిళ దగ్గర నుంచి పురుషుల వరకు చాలామంది ఈ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతేకాకుండా వివిధ శుభకార్యలకు సైతం ఈ బంగారంను కొనుగోలు చేయడానికి జ్యూయాలరీ షాపులకు ఎగబడుతుంటారు. అయితే అక్కడ కాస్త ధర ఎక్కువైన పర్వాలేదు కానీ, నాణ్యత కలిగిన మంచి డిజైనింగ్ అభరణాలను కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. అయితే కస్టమర్ల ఆసక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నగల దుకాణ యాజమానులు వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా పాత బంగారు నగలనే మెరుగు పెట్టి ఎక్కువ ధరలకు అమ్మేయ్యడం వంటివి చేస్తుంటారు. అంతేకాకుండా.. కొన్ని సందర్భాల్లో నకిలీ అభరణాలను కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళకు ఇలాంటి సంఘటన ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

ఇటీవలే ఓ మహిళను బకారా చేసిన ఓ నగల వ్యాపారి  పెద్ద ఎత్తునే మోసం చేశాడు. నాణ్య‌మైన బంగారు న‌గ‌ల‌పేరుతో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయ‌ల‌ దోపిడికి పాల్ప‌డ్డాడు. కాగా, ఘోరమైన ఘటన రాజ‌స్థాన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోక వెళ్తే.. అమెరికాకు చెందిన చెరిష్ అనే మ‌హిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని.. ఓ బంగారు  య‌జ‌మాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన వెండి అభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు చెల్లించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జ‌రిగిన ఎగ్జిబిష‌న్‌లో.. ఆ ఆభ‌ర‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ క్ర‌మంలో అవి న‌కిలీ అభరణాలు అని తేలింది. అంతేకాకుండా.. వాటి విలువ కేవ‌లం రూ. 300 మాత్ర‌మేన‌ని తెలిసి ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో వెంటనే తెరుకున్న మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిల‌దీసింది.

అయితే దుకాణం యాజ‌మాని ఆమె ఆరోపణలను కొట్టి పాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. వెంటనే  స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో తెలిసిన విషయాల మేరకు.. 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సదరు మహిళకు గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడింది. దీంతో  గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం గౌర‌వ్‌, అత‌ని తండ్రి రాజేంద్ర సోనీ ప‌రారీలో ఉండ‌గా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్ద‌రి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి