P Venkatesh
East Coast Railways: ఒకే ట్రాక్ పై నాలుగు రైళ్ళు ఉన్న వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటనపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.
East Coast Railways: ఒకే ట్రాక్ పై నాలుగు రైళ్ళు ఉన్న వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటనపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.
P Venkatesh
భారతీయ రైల్వే నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రయాణికుల నుంచి ఆదరణ పొందింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ జర్నీకే ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. ఇక ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవతప్పిదాలు, అగ్ని ప్రమాదాల కారణంగా అక్కడక్కడ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒకే ట్రాక్ పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది.
రైలు ప్రమాదాల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఒకే ట్రాక్ పై నాలుగు రైళ్లు ఉండడంపై ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్ స్టేషన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. రైల్వే శాఖలోని భద్రతాపరమైన లోపాలకు ఇదే ఉదాహరణ అంటూ నెటిజన్స్ వైరల్ చేయడం మొదలుపెట్టారు. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది. జాతీయ మీడియా కూడా దీనిపై ట్వీట్ చేసింది. ఇక ఈ ఘటనపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టతనిచ్చింది. ఒకే రైల్వే ట్రాక్ పై నాలుగు ట్రైన్లు ఉండడంపై క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో భువనేశ్వర్‌లోని లింగ్‌రాజ్ రోడ్డు పాసింజర్ హాల్ట్ వద్ద చోటు చేసుకుందని తెలిపింది. ఆ వీడియో ఆటో సెక్షన్‌లోనిదని, ఆ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై అనేక రైళ్లు నిలిచి ఉండొచ్చని వెల్లడించింది. ఇది భద్రతాపరమైన లోపం కాదని స్పష్టంచేసింది. సెక్షన్ కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ సాంకేతికత ఉద్దేశమని తెలిపింది. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు మీడియాతో పాటు ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. రైల్వే ప్రతిష్టతకు భంగం కలిగించొద్దని సూచించింది.
Major train accident averted after four trains came on the same track in Odisha’s Bhubaneswar. pic.twitter.com/QOLhSPSApU
— Vani Mehrotra (@vani_mehrotra) July 26, 2024