అయోధ్య గెస్ట్ ల్లో ఒక్క దళితుడైనా కనిపించాడా?: రాహుల్ గాంధీ

Rahul Gandhi Comments on PM Modi: ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహూల్ గాంధి పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రపై విమర్శలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం విషయంలో మరోసారి విమర్శలు చేశారు.

Rahul Gandhi Comments on PM Modi: ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహూల్ గాంధి పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రపై విమర్శలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం విషయంలో మరోసారి విమర్శలు చేశారు.

కేంద్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.  రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఈక్రమంలోనే దేశంలోని వివిధ రంగాలకు చెందిన  ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. లక్షల సంఖ్యలో భక్తులు బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. తాజాగా అయోద్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆహ్వానితుల గురించి ప్రస్తావించిన రాహూల్ గాంధీ.. మోదీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖుల గురించి కాంగ్రెస్ అగ్ర నేత రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పెద్దవాళ్లకే ఆహ్వానాలు వెళ్లాయని..   ప్రారంభోత్సవానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎవరినైనా పిలిచారా? అని ప్రశ్నించారు రాహూల్ గాంధీ.. అదే సమయంలో అమితాబచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్య రాయ్ లను ఆహ్వానించారని మోదీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాహూల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా రాహూల్ గాంధీ.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిధుల గురించి ప్రధాని మోదీని టార్గెట్ చేసుకొని మాట్లాడటం సంచలనంగా మారింది. దేశాన్ని నడిపించే కొంతమందిని అయోధ్య ప్రాణ ప్రతష్ట కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శించారు.  ఈ సందర్భంగా రాహూల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని గమనించారా? అందులో ఒక్కరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ముఖాలను కనిపించాయా? ఈ కార్యక్రమానికి అమితాబచ్చన్ ఆయన కోడలు ఐశ్వర్య బచ్చన్ కపిపించారు. దేశాన్ని నిజంగా నడిపించే ఏ వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో కంటికి కనిపించలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రిచలేరన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’ అని అన్నారు. తాజాగా రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్నికామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments