P Krishna
Lakhpati Didi Yojana Scheme: భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాలు పథకాలను అమలు చేస్తోంది. పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఆర్థికంగా స్థిరపడే విధంగా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది.
Lakhpati Didi Yojana Scheme: భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాలు పథకాలను అమలు చేస్తోంది. పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఆర్థికంగా స్థిరపడే విధంగా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది.
P Krishna
కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. మహిళల కోసం కేంద్రం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కొన్ని పథకాల గురించి తెలియక పోవడం వల్ల వాటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు మహిళలు. ఓ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.5లక్షలు రుణం పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ పథకం పేరు ఏంటీ? దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గత ఏడాది మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ‘లఖపతి దీదీ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహిళలు పరిశ్రమల ఏర్పాటు చేయాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం లఖపతి దీదీ యోజన పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. అయితే ఈ లోను కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు కొన్ని పత్రాలపై వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఎవరైనా మహిళలు దరఖాస్తు చేసుకుంటే.. వారి ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. సదరు మహిళ తప్పనిసరిగా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు అంతకు మించి ఉంటే అర్హులు కాదు. ఈ పథకం స్వయం సహాయక బృందంలోని మహిళలకే వర్తిస్తుంది. వ్యాపార ప్రణాళిక రూపొందించిన తర్వాత ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపబడుతుంది. ప్రభుత్వ అధికారులు దరఖాస్తును సమీక్షిస్తారు.
దరఖాస్తు ఆమోదించినట్లయితే.. ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందానికి రూ.5 లక్షల రుణం ఇవ్వబడుతుంది. అర్హులైన స్వయం సహాయక బృందంలోని మహిళలకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత సొంత వ్యాపారం చేసుకునేందుక వీలుగా రుణం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ యోజన పథకంతో అనుసంధానం చేయాలని.లఖపతి దీదీ పథకం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్లంబింగ్, డ్రోన్ రిపేర్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీ తదితర రంగాల్లో శిక్షణ పొందేందుకు వీలుగా మహిళలను స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశారు. దరఖాస్తు కోసం నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతాతో పాటే ఆధార్ కార్డు కి అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. మీరు ఇప్పటికే స్వయం సహాయక బృందంలో సభ్యులు కాకుంటే వెంటనే జాయిన్ కావాల్సి ఉంటుంది.
లఖపతి దీదీ యోజనకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించండి. వారు ఈ పథకానికి సంబంధించిన వివరాలు వివరణాత్మకంగా అందిస్తారు. ఇందుకు సంబందించిన దరఖాస్తు ఫారాలు తీసుకొని అవసరమైన అన్ని పత్రాలు సమర్పించండి. మీ పత్రాలను అధికారులు తనిఖీ చేసిన తర్వాత పథకానికి మీరు అర్హులు అనుకుంటే ఓ లెటర్ ఈ మెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ వస్తుంది. మీకు లోన్ మంజూరు అయిన తర్వాత వర్క్ షాప్, ఇతర శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మీరు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంటే లఖపతి దీదీ యోజన యొక్క ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. రాజస్థాన్ లో దాదాపు 11.24 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.