Anant Ambani Marriage: అనంత్ అంబానీ-రాధికా పెళ్లిపై ప్రియా చౌదరి సంచలన కామెంట్స్!

Priya Chowdary Comments on Anant Ambani Marriage: ముఖేష్‌ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో మనమంతా వార్తల్లో విన్నాం చూశాం! ఆ పెళ్లిపై స్పందిస్తూ.. ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆమె కోపానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Priya Chowdary Comments on Anant Ambani Marriage: ముఖేష్‌ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో మనమంతా వార్తల్లో విన్నాం చూశాం! ఆ పెళ్లిపై స్పందిస్తూ.. ప్రియా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆమె కోపానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

దేశమంతా మాట్లాడుకునేలా అంబానీ ఇంట్లో పెళ్లి జరిగింది. ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరిగా నిలిచే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు, తమ ముద్దుల చిన్న కొడుకు పెళ్లిని ఎంతో గొప్పగా చేయాలని భావించి.. దేశంలోని ప్రముఖలందరినీ, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రెటీలను పిలిచి.. నః భూతో నః భవిష్యతీ అన్న రీతిలో చాలా గ్రాండ్‌గా వివాహం జరిపించారు. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి గురించే చర్చ. అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని. కానీ, అసలు ఖర్చు ఎంతైందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.

అయినా కూడా కొంతమంది అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పెళ్లిపై అనవసరపు కామెంట్లు చేస్తున్నారు. వాటిపై ప్రముఖ లైఫ్‌ కోచ్‌, మోటివేషనల్‌ స్పీకర్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ ప్రియా చౌదరి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా అనంత్‌ అంబానీ పెళ్లి గురించే ఉంది. అయితే అసలు వీళ్ల పెళ్లి గురించి జనం ఏమనుకుంటున్నారా? అని కామెంట్‌ సెక్షన్‌ ఓపెన్‌ చేస్తే.. కొంతమంది.. ‘చనిపోతాడని తెలిసినా ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నారు? అసలు ఇన్ని వేల కోట్లు పెట్టి పెళ్లి చేసే బదులు ఆ డబ్బును పేదలకు పంచిపెట్టవచ్చుగా!’ అనే కామెంట్లు కనిపించాయి.’’ అని ఆమె తెలిపారు. అలాంటి కామెంట్స్‌పై చాలా ఘాటుగా రియాక్ట్‌ అయిన ప్రియా చౌదరి.. అసలు వాళ్ల ఖర్చు గురించి వీళ్లకు ఎందుకంటూ మండిపడ్డారు.

లక్షల కోట్లు ఉన్న సంపన్నుడి ఇంట్లో పెళ్లి అలానే జరుగుతుందుని, అంబానీని ప్రశ్నించే బదులు అసలు ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలని. అంబానీ స్థాయికి ఆయన పెళ్లి జరిపిస్తే.. మన స్థాయికి మన పెట్టే ఖర్చులో ఎంత శాతం పేదలకు ఇస్తున్నాం? అనేది చూసుకోవాలని అన్నారు. అయితే.. నెటిజన్ల నుంచి చనిపోయే వాడికి ఈ పెళ్లి అవసరమా? అనే కామెంట్లు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనంత్‌ అంబానీ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో చాలా పుకార్లే వస్తున్నాయి. వాటికి ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవు. అయినా.. శుభమా అని ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇలాంటి కామెంట్స్‌ ఏంటనే విమర్శలు వస్తున్నాయి.

అయినా అంబానీ ఎవరి దగ్గరో దోచుకున్న సోమ్ముతో తన కుమారుడికి పెళ్లి చేయడం లేదు కదా.. చట్టబద్దంగా చేసిన వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే కదా ఇంత అడంబరంగా పెళ్లి చేస్తోంది. అయినా ఇదే అంబానీ ఇలా ఖర్చు పెట్టకుండా తన కుమారుడికి రిజిస్ట్రార్‌ మ్యారేజ్‌ చేసి ఉంటే.. ఇప్పుడు ఇంత ఖర్చు ఎందకని అంటున్న వాళ్లే.. అంబానీ ఎంత పిసినారోడో అనే వాళ్లు. అయినా.. ఇప్పుడు అంబానీ చేస్తున్న ఖర్చులో ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. డబ్బు విషయం పక్కనపెడితే.. ఓ యువకుడు, ఓ యువతి ఇష్టపడి ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు, ఎంతో మంది ప్రముఖల మధ్య.. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ.. వివాహ బంధంతో ఒక్కటవుతూ ఉంటే.. నిండు మనుసుతో ఆశీర్వదించాల్సింది పోయి.. చెత్త కామెంట్ల చేస్తున్న వారు.. ప్రియా చౌదరి చెప్పిన మాటలతోనైనా మారాలని చాలా మంది నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments