2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. దాంతో కేంద్రంలోని కీలక నేతలను తమ రాష్ట్రాల్లో పోటీకి నిలిపి లబ్దిపొందాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈసారి తెలంగాణ నుంచి ఏకంగా ప్రధాని మోదీనే బరిలో ఉంచాలని భావిస్తోంది బీజేపీ పార్టీ. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి 170 సీట్లు కైవసం చేసుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది.
దక్షిణాది రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నగార మోగడంతో.. పార్టీలు అస్త్రశస్త్రాలు నమోదు చేసుకుంటున్నాయి. ఎవరెవరిని ఎక్కడి నుంచి పోటీకి దింపాలో ఇప్పటి నుంచే లిస్ట్ ను రెడీ చేసుకునే పనిలో పార్టీలు పడ్డాయి. ఇలాంటి సమయంలో స్టేట్ పాలిటిక్స్ హీటెక్కేలా ఓ న్యూస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ న్యూస్ ఏంటంటే? తెలంగాణలో ఓ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ పోటీ చేయనున్నారట. ప్రధానిని దక్షిణాది నుంచి బరిలో దింపడానికి ప్రధాన కారణం సౌత్ ఇండియాలోని 170 సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టడమే.
ఇక కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపనున్నారనే ఊహాగానాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ధీటుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి బరిలోకి దించే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయట బీజేపీ వర్గాలు. గత కొన్ని రోజులగా తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ వార్త వైరల్ గా మారడంతో.. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తారా? చేయరా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: మరో లేఖ విడుదల చేసిన సుఖేష్.. ఈసారి KTR పేరు కూడా..!