iDreamPost
android-app
ios-app

మరో లేఖ విడుదల చేసిన సుఖేష్.. ఈసారి KTR పేరు కూడా..!

మరో లేఖ విడుదల చేసిన సుఖేష్.. ఈసారి KTR పేరు కూడా..!

సుఖేష్ చంద్రశేఖర్ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మనీలాండరీ కేసులో నిందితుడిగా ఉండి.. తిహార్ జైలు నుంచి లేఖలు విడుదల చేస్తూ ఉంటాడు. ఆ లేఖల్లో సంచలన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. తాజాగా సుఖేష్ మరో లేఖను విడుదల చేసాడు. ఈసారి లేఖలో కేవలం ఎమ్మెల్సీ కవిత మీద మాత్రమే కాకుండా.. మంత్రి కేటీఆర్ మీద కూడా సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరిగాయంటూ ఆరోపించాడు. ఆ లేఖపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

లేఖలో సుఖేష్ పలు ఆరోపణలు చేశాడు. కేటీఆర్- కవిత కలిసి తనకు రూ.100 కోట్లు, శంషాబాద్ దగ్గర మంచి ల్యాండ్, వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు కూడా ఆఫర్ చేశారంటూ ఆరోపించాడు. కవిత, కేటీఆర్ తో చేసిన చాటింగ్ 250 జీబీ వరకు ఉందంటూ చెప్పుకొచ్చాడు. వారి మధ్య రూ.2 వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్పాడు. అన్నింటికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ వెల్లడించాడు.

సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా అతను చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అంటే ఎవడో కూడా తనకి తెలియదని చెప్పారు. సుఖేష్ అనే ఒక రోగ్ మాట్లాడిన అడ్డదిడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటనని తెలిపారు. సుఖేష్ లాంటి ఒక నేరస్తుడు చేసిన ఆరోపణలను ప్రసారం చేయడం, ముద్రించే సమయంలో మీడియా కాస్త ఆలోచించుకోవాలని సూచించారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom