వీడియో: పూజారులు కొట్లాట!.. ఏకంగా గుడి ముందే ఇలా!

ఇటీవల ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై కొంతమంది ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో చేసే పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై కొంతమంది ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో చేసే పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మద్య కాలంలో చిన్న చిన్న విషయాలకే మనుషుల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకొని, చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. గుడిలో పూజలు చేస్తూ వేదమంత్రాలు పఠించే పూజారులు చిన్న గొడవ కారణంగా మాటల యుద్దానికి దిగారు.. దానితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కొట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ పూజారుల కొట్లాట ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అసలు ఎందుకు వీరి మద్య అంతగా మాటల యుద్దం, కొట్లాట జరిగింది అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. పూజారుల మధ్య జరిగిన ఘర్షణకు అసలే కారణం ఏంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రంలోని ఓ గుడిలో పూజలు చేసే పూజారులు ఒకరినొకరు తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. మీ అంతు చూస్తాం రా అంటూ దేవుడి ఎదుటే శపథం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ళ ఆలయం వద్ద జరిగింది. 108 వైష్ణవ ఆలయాల్లో వరదరాజ పెరుమాళ్ల ఒకటి. ఇది దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచిన ఆలయం. ఇక్కడ జరిగిన గొడవకు అసలు కారణం ఏంటంటే.. ప్రతి సంవత్సరం కనుమ పండుగ సందర్భంగా వరదరాజు పెరుమాళ్ళ స్వామి విహార యాత్రకు వెళ్తుంటారు. నిత్యం గుడిలో ఉండే స్వామి.. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు రోజు భక్తుల వద్దకు వెళ్లడం అనాధిగా వస్తున్న ఆచారం. ఇది పార్వేట ఉత్సవం పేరుగా పిలుస్తారు.

ఆలయం నుంచి బయలుదేరే స్వామి వారు అయ్యన్ పేట, ముత్యాలపేట, కురుకుపేట, కిలిఒట్టివాకం, తిమ్మరాజు పేట, వెంగుడి, పుల్యంబాక్కం, వాలాజాబాద్ గ్రామాల మీదుగా ఊరేగింపుగా వెళ్లి పళశివరం గ్రామంలోని కొండపైకి చేరుకుంటారు. ఈ ఊరేగింపు ఉత్సవానికి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులతో పాటు పూజారులు అందరూ ఈ వేడుకకు హాజరవుతుంటారు. ఈసారి కూడా పార్వేట ఉత్సవానికి బయలుదేరిన స్వామికి పూజారులు పాటలు పాడటం ఆనవాయితీ.. ఇక్కడే పూజారుల మధ్య వివాదం చెలరేగింది. అయ్యంగార్లలో ఉత్తర-దక్షణ అనే వర్గాలు ఉన్నాయి. స్వామి వారికి పాట మేం ముందు పాడాలంటే.. మేం ముందు పాడాలని రెండు వర్గాల పూజారులు పంతానికి వెళ్లారు.

ఈ విషయంలో ఇరు వర్గాల పూజారులకు మాటల యుద్దమే కాదు.. తొక్కిసలాట, దాడులు, పరుగెత్తుకుంటూ కొట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజారుల మద్య గొడవ చూసి.. వేడుకకు వచ్చిన భక్తులు షాక్ తిన్నారు. మొత్తానికి భక్తులు, పోలీసులు, అధికారులు కలగజేసుకొని వివాదాన్ని తాత్కాలికంగా ముగింపు పలికారు. ఈ వివాదం కొన్నేళ్ళ నుంచి నడుస్తుందని.. ఈ కేసుపై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయని అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments