iDreamPost
android-app
ios-app

పోస్టల్ శాఖలో కోలువుల జాతర.. 30 వేల పోస్టులకు భారీ నోటిఫికేషన్!

  • Author Soma Sekhar Published - 05:07 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 05:07 PM, Fri - 4 August 23
పోస్టల్ శాఖలో కోలువుల జాతర.. 30 వేల పోస్టులకు భారీ నోటిఫికేషన్!

2023వ సంవత్సరంలో తపాలా శాఖలో కోలువుల జాతర కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో 40 వేలకు పైగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన పోస్టల్ శాఖ.. మే నెలలో మరో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది తపాలా శాఖ. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పదవ తరగతి పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30, 041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు తపాలా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 23 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా.. ఆగస్టు 24 నుంచి 26 వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించారు. కాగా.. బ్రాంచ్ పోస్టు మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. ఈ పోస్టులకు పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియమకాలు చేపట్టనున్నట్లు అధికారులు నోటిఫికేషన్ లో తెలిపారు. అయితే ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక బాష ఉండటం తప్పనిసరి.

ఇక ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా సైకిల్ తొక్కడం రావాలి. వేతనాలు ఎలా ఉంటాయంటే? బీపీఎం వేతన శ్రేణి రూ. 12 వేల నుంచి రూ. 29, 380 కాగా, ఏబీపీఎం/డాక్ సేవక్ కు రూ. 10 వేల నుంచి రూ. 24, 470గా నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున సడలింపు ఉంది. కాగా.. మెుత్తం 30, 041 పోస్టుల్లో ఏపీలో 1058, తెలంగాణలో 961 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలనుకునే వారు https://indiapostgdsonline.gov.in/ ఈ లింక్ ను క్లిక్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిపూర్తివివరాలకోసం https://indiapostgdsonline.cept.gov.in/Notifications/Model_Notification.pdf
ఈ లింక్ ను క్లిక్ చేయండి.

ఇదికూడా చదవండి: TS RTC బిల్లుపై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలుపని గవర్నర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి