iDreamPost

TS RTC బిల్లుపై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలుపని గవర్నర్!

TS RTC బిల్లుపై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలుపని గవర్నర్!

ఇటీవల ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ విలీనంకు సంబంధించిన బిల్లు ఇంకా అసెంబ్లీకి చేరలేదు. కారణం.. ఆ బిల్లు ఇంకా రాజ్ భవన్ లోని గవర్నర్ వద్ద ఉంది. కాగా.. ఆమె ఆమోదం  తెలిపితేనే.. ఆ  బిల్లు అసెంబ్లికి  రావడం.. అక్కడ ప్రవేశ పెట్టి.. ఆమోదం తెలిపే పక్రియ జరుగుతుంది. గత కొంతకాలం నుంచి గవర్నర్ కు, కేసీఆర్ సర్కార్ పొసగడం లేదు. గతంలో పలు బిల్లులను కూడా  గవర్నర్ ఆమోదించలేదు. తాజాగా ఆర్టీసీ బిల్లు అంశంలో మళ్లీ కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ గా మారింది.

ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని సంకల్పంతో కేసీఆర్ సర్కార్ ఉంది. అయితే గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఉండటంతో ఈ పక్రియ ఆలస్యంగా జరుగుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ విలీనంకు సంబంధించిన బిల్లు రాజ్ భవన్ లో ఉంది. అయితే  ప్రభుత్వం పంపిన ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ స్పందించారు. ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం కావాలని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు చేరిందని తెలిపిన గవర్నర్ వెల్లడించారు.

అయితే ఈ బిల్లుపై ఉన్న సందేహాల పట్ల న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందని.. అందుకు కాస్త సమయంల పట్టే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా.. సిబ్బందిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని  ఇటీవల మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే బిల్లును రూపొందించారు. ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో నిబంధనల ప్రకారమే గవర్నర్‌కు పంపించింది.

కానీ.. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. దీంతో బిల్లు అసెంబ్లిలో ప్రవేశపెట్టేందుకు ఆలస్యం కానుంది.  ఈ వ్యవహారం చూసిన రాజకీయా విశ్లేషకులు ఇది కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ లా సాగుతుందని అంటున్నారు. అలానే బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బిల్లును గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరి.. ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం, గవర్నర్ మధ్య నడుస్తున్న వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  త్వరలోనే కేంద్ర పాలితప్రాంతంగా హైదరాబాద్‌.. ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి