iDreamPost
android-app
ios-app

ఐటీ అధికారిని అంటూ మోసం.. చెక్ పెట్టిన పోలీసులు!

ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో మోసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది పలానా డిపార్ట్ మెంట్ కి చెందిన అధికారుల అంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారి రంగు బయటపడి అరెస్ట్ అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో మోసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది పలానా డిపార్ట్ మెంట్ కి చెందిన అధికారుల అంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారి రంగు బయటపడి అరెస్ట్ అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఐటీ అధికారిని అంటూ మోసం.. చెక్ పెట్టిన పోలీసులు!

ఈజీ మనీ కోసం కొంతమంది ఎన్నో రకాలుగా అక్రమాలకు పాల్పపడుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ అమ్మకాలు, హైటెక్ వ్యభిచార దందాలు నిర్వహించడం.. ఇలా ఎన్నో రకాలుగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మరికొంతమంది ట్రాఫిక్ పోలీస్, పోలీస్ అధికారి, ఐటీ డిపార్ట్ మెంట్ కి చెందిన వాళ్లం అని చెప్పి అమాయకులను బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. కొన్నిసార్లు తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఓ మహిళ ఐటీ అధికారి హడలెత్తించింది. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు రంగు బయట పడింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల నకిలీ అధికారుల వేషంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఐటీ అధికారులం అని చెప్పి కొన్ని జూవెలరీ షాపులు, బడా వ్యాపారుల ఇండ్లకు వెళ్లి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు బాధితులకు అనుమానం రావడం.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నకిలీ అధికారులను అరెస్టు చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా పొగుగైనగర్ కు చెందిన బాలాజీ భార్య శ్రుతిలయ (29) డిగ్రీ పూర్తి చేసింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఆమె పేరుతో ఆడిటింగ్ ఆఫీస్ ని మెయింటేన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి బుధవారం రాత్రి.. బాలాజీ ఆడిటింగ్ కార్యాలయానికి వచ్చింది. ఐటీ అధికారుల దుస్తులు ధరించి అసోసియేట్స్ ఆఫీస్ కి వచ్చింది. ఆ సమయానికి శ్రతిలయ ఒక్కతే ఉంది.

తాను ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వస్తున్నానని.. మీ ఆడిటింగ్ కార్యాలంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా తాను చూసుకుంటానని.. అర్జంట్ గా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించింది. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన శ్రతిలయ వెంటనే ఆఫీస్ లో ఉన్న లక్ష రూపాయలు తెచ్చేందుకు వెళ్లింది. అయితే వచ్చిన యువతిపై శ్రుతిలయకు అనుమానం రావడంతో ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్ తో పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటన స్పాట్ కి చేరుకున్నారు. ఐటీ అధికారిని అని చెప్పి మోసానికి పాల్పపడిన సదరు యువతి హుసూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఈ-సేవా కేంద్రం నిర్వహిస్తున్న దీప (33) అని పోలీసు తెలిపారు. చీటింగ్, బెదిరింపు కేసు కింద ఆమెను అరెస్ట్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి