iDreamPost
android-app
ios-app

Bullet Train: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. త్వరలో దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు!

దక్షిణ భారత్‌లో త్వరలోనే బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం ఉత్తర భారత్ లో ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతరం సౌత్ లో కూడా బుల్లెట్ ట్రైన్ రానుంది.

దక్షిణ భారత్‌లో త్వరలోనే బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం ఉత్తర భారత్ లో ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతరం సౌత్ లో కూడా బుల్లెట్ ట్రైన్ రానుంది.

Bullet Train: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. త్వరలో దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు!

భారత దేశంలోని అతి పెద్ద వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. అలానే అతిపురాతనమైన వ్యవస్థల్లో ఒకటి ఈ రైల్వే. ఏళ్లు గడుస్తున్న కొద్ది  అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ లో వందే భారత్ ట్రైన్లు పట్టాల మీద పరుగులు తీస్తున్నాయి. గతంలో కంటే మెరుగైన సేవలను ఈ వందే భారత్ రైలు ప్రయాణికులకు అందిస్తున్నాయి. ఇక ఈ వందే భారత్ తరువాత బుల్లెట్ ట్రైన్ త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు 2026లో సిద్ధంగా ఉంటుంది. ముంబై- అహ్మదాబాద్ మధ్య ఈ బుల్లెట్ రైలు నడవనుంది. తాజాగా దక్షిణ భారత్ దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలను కలుపుత వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గుండా కూడా  ఈ రైళ్లులు నడుసున్నారు. వందే భారత్ లో కూడా మూడు రకాల ట్రైను పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. రైల్వే వ్యవస్థలో వందే భారత్  రైలు తరువాత అప్ డేట్ వర్షన్ గా బుల్లెట్ ట్రైన్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణ భారత్ దేశంలో కూడ బుల్లెట్ ట్రైన్ వస్తే బాగుంటుందని ఎంతో మంది ఆశగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆదివారం బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సందర్భంగా సౌత్ ఇండియాకు బుల్లెట్ ట్రైన్ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలచేసింది. ఈ క్రమంలో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ  బుల్లెట్  ట్రైన్ ల గురించి ప్రస్తావించారు. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్న ఆయన.. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ బుల్లెట్ రైళ్ల సేవలు విస్తరిస్తామని ఆయన. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

వందేభారత్‌ రైలు సర్వీసులను దేశంలోని  అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. వందేభారత్‌ వర్షన్ లో వందేభారత్ స్లీపర్‌, వందేభారత్ ఛైర్‌కార్‌, వందే భారత్ మెట్రో అనే మూడు మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయని  మోదీ అన్నారు. 2019 ఫిబ్రవరిలో వందేభారత్‌ సేవలు తొలిసారి ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. మొత్తంగా దక్షిణ భారత్ దేశానికి కూడా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే అంశంపై ప్రధాని మోదీ ప్రస్తావించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భవిష్యత్ లో సౌత్ ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది.