Arjun Suravaram
Narendra Modi Meet Mohini: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాటక రాష్ట్రంలో ఓ చిరు వ్యాపారిని ప్రధాని మోదీ కలిశారు. ఆమె కథ తెలిస్తే మీరు ఆశ్చర్య పడక మానరు.
Narendra Modi Meet Mohini: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాటక రాష్ట్రంలో ఓ చిరు వ్యాపారిని ప్రధాని మోదీ కలిశారు. ఆమె కథ తెలిస్తే మీరు ఆశ్చర్య పడక మానరు.
Arjun Suravaram
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అలానే దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే రెండు విడుతల్లో పోలింగ్ పూర్తైంది. ఇక మూడో విడత పోలింగ్ త్వరలో జరగనుంది. ఈ నేపథ్యం లో మూడో విడత ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..పండ్లు అమ్ముకునే వీధి వ్యాపారిని కలిశారు. మరి.. ఆమె ప్రత్యేకత ఏమిటో తెలిస్తే..మీరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. హ్యాట్సాఫ్ చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సభల్లో పాల్గొంటూ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరిస్తున్నారు. అలానే తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కర్నాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాన మోదీ ఓ వీధి వ్యాపారితో ముచ్చటించారు. కర్ణాటక లోని సిరసి పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడ స్థానికంగా మోహిని గౌడ అనే మహిళతో ముచ్చటించారు. ఆమె స్థానికంగా పండ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంది. స్వచ్ఛభారత్ కోసం ఆమె చేస్తున్న పనిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎంతో మందికి ఈ మహిళా ఆదర్శంగా నిలిచింది అంటూ ప్రధాని ఆమెను కొనియాడారు.
ఇక ఆమెను ప్రధాని అంతలా అభినందించడానికి గల కారణం ఏమిటో తెలిస్తే..మీకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పక మానరు. మోహిని గౌడ స్వస్థలం కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుక హాలక్కి ప్రాంతం. ఆమె ఎన్నో ఏళ్లను నుంచి పండ్లు అమ్ముకుంటూ జీవనంస సాగిస్తోన్నారు. అంకోలా బస్టాండ్‌లో ఆమె బుట్టలో పండ్లు విక్రయిస్తున్నారు. అయితే అందులో వింత ఏముందని మీకు సందేహం రావొచ్చు.
ఇక్కడే ఆమె ప్రత్యేకత ఉంది. సాధారణంగా పండ్లను విక్రయించే వారు.. ప్లాస్టిక్ కవర్లలో వాటిని కొనుగోలుదారులకు ఇస్తుంటారు. మోహిని గౌడ మాత్రం అందరిలాగా కవర్లలో ఇవ్వలేదు. వాటి వలన పర్యావరణంకు హానీకరం అని భావించారు, అలానే ప్రధాని మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ కి ఆమె ఆకర్షితురాలయ్యారు. అందుకే అందరిలాగా కవర్లలో కాకుండా ఆకుల్లో పండ్లను విక్రయిస్తున్నారు. కొందరు ప్రయాణికులు పండ్లను కొని.. వాటిని తిన్న తర్వాత ఆకులను అక్కడే పడేసి వెళ్లిపోవడాన్ని మోహిణి గమనించారు. అలా చాలాసార్లు ప్రయాణికులను గమనించిన ఆమె మనస్సు బాధించింది. అందుకే ఎవరికో చెప్పడం ఎందుకని భావించిన ఆమె.. ప్రయాణికులు పడేసిన ఆ వ్యర్థాలను తానే సేకరించి చెత్త బుట్టలో వేయడం ప్రారంభించింది.
అదే విధంగా చెట్ల నుంచి రాలిన ఆకులనూ ఊడ్చి పడేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఆదర్శ్ హెగ్డే అనే వ్యక్తి ఆమె చేస్తున్న పనిని చూసి వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ మోహినిని ప్రశంసించారు. ఈ క్రమంలోనే మోహిని గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ గురువారం సిరిసి పర్యటన సమయంలో ఆమెను హెలిప్యాడ్ వద్ద కలిశారు. ఏకంగా దేశ ప్రధానినే తనను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.