P Krishna
Oil Prices to Rise Soon: గత కొంత కాలంగా నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం పెరిగిపోవడంతో విలవిలలాడిపోతున్నారు.
Oil Prices to Rise Soon: గత కొంత కాలంగా నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం పెరిగిపోవడంతో విలవిలలాడిపోతున్నారు.
P Krishna
ఇటీవల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి. పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కూరగాయలు, మాంసం, పప్పు, ఉప్పు, వంటనూనె, ఇంధన ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఏడాది క్రితం పోల్చితే ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.. దీని ప్రభావం ఇంటి ఖర్చులపై తీవ్రంగా చూపిస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపాదన తక్కువ.. మార్కెట్ లో తరుచూ పెరిగిపోతున్న ధరల పెరుగుదలతో సామాన్యులు ఏం కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం మరో షాకింగ్ ప్రకటన చేసింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాల వల్ల సామాన్యులు లబో దిబో అంటున్నారు. తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ వరుసగా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం.. నిన్న ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా వంటనూనెల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచింది. మొన్నటి వరకు కొన్నింటిపై ఎలాంటి టాక్స్ లేవు.. అలాంటి వాటికి తాజాగా తీసుకున్న నిర్ణయంతో అమాంతం 20 శాతానికి పెరిగింది. క్రూడ్ సోయా, క్రూడ్ పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల వంటి వాటిపై 20 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే వీటన్నింటి రేట్లు పెరిగే అవకావం ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు, రిఫైన్స్ సోయా నూనెలపై గతంలో 12.5 శాతం సుంకం ఉండేది.. ఇప్పుడు 32.5 శాతానికి పెరిగిపోయింది. మొత్తంగా ముడి నూనెలపై ట్యాక్స్ 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ ఆయిల్ పై 13.5 శాతం నుంచి 35.75 శాతానికి పెరిగనుంది. నిన్న దీనిపై ప్రకటన రాగా.. నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నూనెలపై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ కూడా పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మొత్తం కలుపుకుంటే ఈ రిఫైన్డ్ నూనెల ఇంపోర్ట్ డ్యూటీ ఏకంగా 35.75 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో వంట నూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.