Nidhan
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అసలు ఆయన ఎందుకు సారీ చెప్పారు? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అసలు ఆయన ఎందుకు సారీ చెప్పారు? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
దేశ ప్రధాని అంటే ఇచ్చే గౌరవం, మర్యాద ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఎదురొచ్చి పూలమాలలతో స్వాగతాలు, శాలువాలతో సత్కారాలు, అహో ఒహో అంటూ పొగడ్తలు.. ఇలా పీఎం లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాని స్థాయి వ్యక్తి ఓ మాట అన్నారంటే అదే శాసనంగా మారుతుంది. అందుకే ఆ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలకు అందరూ ఎంతో విలువ ఇస్తారు. వాళ్లు ఇచ్చే ప్రసంగాలను కూడా అంతే శ్రద్ధగా వింటారు. అలాంటి స్థాయి వ్యక్తి నుంచి క్షమాపణ చెప్పడాన్ని మాత్రం ఎవరూ ఊహించరు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ కోరారు. అసలు ఆయన ఎందుకు సారీ చెప్పారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జార్ఖండ్‌లోని ధన్బాద్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆయన్ను చూసేందుకు బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కూర్చునేందుకు కుర్చీలు లేక అనేక మంది నిల్చొని మోడీ ప్రసంగాన్ని తిలకించారు. దీంతో వేదిక మీద ప్రధాని మాట్లాడుతూ.. ముందుగా అందరూ తనను క్షమించాలని కోరారు. ‘మీ అందరూ నన్ను క్షమించాలని కోరుతున్నా. ఈ సభలో కేవలం 5 శాతం మంది మాత్రమే నీడలో ఉన్నారు. మిగిలిన 95 శాతం మంది ఎండలోనే నిల్చున్నారు. అందుకోసం మీరంతా నన్ను దయచేసి క్షమించాలి’ అని మోడీ కోరారు.
ప్రజలు తనను క్షమించాలంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఆయన్ను అభినందిస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి క్షమాపణ కోరడం చాలా రేర్ అని.. ఈ విషయంలో మోడీని మెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. సభకు వచ్చిన విషయంపై ప్రసంగించకుండా తొలుత ఎండలో నిలుచున్న వారి గురించి ఆలోచించడం, వారికి సారీ చెప్పడం ఆయన సంస్కారం ఎలాంటిదో చాటి చెప్పిందని అంటున్నారు. ఇక, ఈ సభలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై మోడీ దుమ్మెత్తిపోశారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో హస్తం పార్టీ అందరి కంటే ముందంజలో ఉంటుందని విమర్శించారు. మరి.. ఎండలో నిలుచున్న వారికి మోడీ క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అంబానీ ఇంటికి క్రికెటర్లు! ధోని ఎంట్రీ మామూలుగా లేదుగా..