iDreamPost

అంబానీ ఇంటికి క్రికెటర్లు! ధోని ఎంట్రీ మామూలుగా లేదుగా..

  • Published Mar 01, 2024 | 6:06 PMUpdated Mar 01, 2024 | 6:06 PM

Ambani Wedding, MS Dhoni: అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్‌ క్రికెటర్లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశమే కాదు.. మొత్తం ప్రపంచం మాట్లాడుకునేలా ఈ పెళ్లిని జరిపిస్తున్నారు ముఖేష్‌ అంబానీ. ముఖేష్‌-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్‌ అంబానీకి మరో పారిశ్రామిక వేత్త కుమార్తె రాధికా మర్చంట్‌తో వివాహం నిశ్చయమైంది. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో వీరి ఫ్రీ వెడ్డింగ్‌ వేడకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మంది టీమిండియా స్టార్‌ క్రికెటర్లు ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యారు.

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అక్కడికి వచ్చేశాడు. వీరితో పాటు మహేంద్ర సింగ్‌ ధోని, అతని భార్య సాక్షి, సూర్యకుమార్‌ యాదవ్‌ అతని భార్య, ఇషాన్‌ కిషన్‌, జహీర్‌ ఖాన్‌ అతని భార్య, డ్వేన్‌ బ్రావో, టిమ్‌ డేవిడ్‌ అతని భార్య, ట్రెంట్‌ బౌల్ట్‌ అతని భార్య, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ సైతం ఈ వేడకకు విచ్చేశాడు.

స్టార్‌ క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ సినీ తారలు కూడా అంబానీ ఇంటికి క్యూ కట్టారు. ఆమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా అతని భార్య హీరోయిన్‌ కియారా అద్వానీ, సైఫ్‌ అలీ ఖాన్‌ అతని భార్య హీరోయిన్‌ కరీనా కపూర్‌, శ్రద్ధా కపూర్‌, అజయ్‌ దేవగన్‌ ఇలా చాలా మంది సెలబ్రెటీలు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే.. వీరిందరిలో ఎంఎస్‌ ధోని ఎంట్రీ అదిరిపోయిందంటూ.. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. మరి అంబానీ ఇంట పెళ్లి సందడికి స్టార్లు ఇలా క్యూ కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి