iDreamPost
android-app
ios-app

రైతులకు ప్రధాని శుభవార్త! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి భారీగా పెంపు…

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అంతేకాక వారి ఆదాయం పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఓ రాష్ట్రానికి చెందిన రైతులకు మోదీ శుభవార్త చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అంతేకాక వారి ఆదాయం పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఓ రాష్ట్రానికి చెందిన రైతులకు మోదీ శుభవార్త చెప్పారు.

రైతులకు ప్రధాని శుభవార్త! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి భారీగా పెంపు…

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కేంద్రం పలు పథకాలను ప్రవేశ పెట్టింది.  అలానే వ్యవసాయానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అలానే తరచూ రైతులకు కేంద్రం ప్రభుత్వం  శుభవార్త చెబుతూనే ఉంటుంది. అలానే తాజాగా మరోసారి రైతులకు మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది.  ఏంటేటే రైతులకు పెట్టుబడి సాయం కింద  ఇస్తున్న రూ. 6 వేలను రూ.12 వేలకు పెంచుతమని హామి ఇచ్చారు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేయనున్నట్లు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. మరి.. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక వాతావరణం కొనసాగుతోంది. ఇక ఎన్నికల సందర్భంగా ఓటర్లను  ఆకర్షించేందుకు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.  ముఖ్యంగా రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ఓట్లను తమకు అనుకూలం మార్చుకునేలా వివిధ రకాల పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న స్కీమ్స్ ను మరింత పెంచి ఇస్తామని మేనిఫేస్టోల్లో ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది. సోమవారం రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతేకాక ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన కూడా చేశారు. రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే..  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతామని హామి ఇచ్చారు.

ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలను రెట్టింపు చేసి.. ఏటా రూ.12 వేలు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. దీంతోపాటు మరిన్ని హామీలను రాజస్థాన్ ఓటర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుప్పించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే.. రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకుకొనుగోలు చేస్తామన్నారు.  ఈ మద్దతు ధరకు తోడు అదనంగా రైతులకు బోనస్‌ కూడా ఇస్తామని కూడా ప్రధాని భరోసా ఇచ్చారు.

ఇక పక్క రాష్ట్రాలతో పోల్చితే రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు.  బీజేపీ అధికారంలోకి వస్తే ఇంధన ధరలపై సమీక్ష జరుపుతామని హామీ ఇచ్చారు. పక్కరాష్ట్రాలతో పొల్చితే రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.12, రూ.13 అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక అధికార కాంగ్రెస్ పై మోదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మరి.. రైతులకు  పెట్టుబడిసాయం పెంచుతూ మోదీ ఇచ్చిన హామీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.