iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పెన్షన్!

  • Published Apr 11, 2024 | 5:25 PM Updated Updated Apr 11, 2024 | 5:25 PM

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఓ రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే అతని పరిస్థితి ఏమిటి, పోషణ ఎలా అనే విషయాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఓ రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే అతని పరిస్థితి ఏమిటి, పోషణ ఎలా అనే విషయాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 11, 2024 | 5:25 PMUpdated Apr 11, 2024 | 5:25 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3వేలు పెన్షన్!

ఇప్పటికే మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద, ప్రజల నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధలు వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభించారు. అలానే దేశానికి వెన్నెముక అయినా రైతు.. కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఎందుకంటే.. నిరంతరం కష్టపడి శ్రమిస్తున్న రైతు సుభిక్షంగా ఉంటే.. దేశం క్షేమంగా ఉంటుంది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను అందిస్తూ ఎప్పుడు వారిని ప్రోత్సహిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు పెట్టుబడి సాయం దగ్గర నుంచి సబ్సిడీలపై ఎరువులు, మందులు, ఏదైనా అకాల విపత్తుతో నష్టం వాటిల్లితే పరిహారం వంటివి కూడా అందిస్తూ సాయం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సాగు చేసే రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి, అదే రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే పరిస్థితి ఏమిటి? వయసు పైడిన తర్వాత వారు సాగు చేయలేక పోతే వారి పోషణ ఎలా? అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసమే రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ఓ రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే అతని పరిస్థితి ఏమిటి, పోషణ ఎలా అనే విషయాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిపేరు ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. దీని సాయంతో అరవై ఏళ్లు పైడిన రైతులకు నెలకు రూ. 3,000 పింఛన్ అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన స్కీమ్ చేరేందుకు రైతుకు కనీస అర్హత 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే ప్రభుత్వ భూ రికార్డుల్లో పేరు ఉండి.. రెండు హెక్టార్ల వరకూ సాగు చేయదగిన భూమి ఉన్న రైతులు ఇందుకు అర్హులు. కాగా, ఇప్పటి వరకు ఈ పథకంకు 19,47,588 మంది రైతులు నమోదు చేసుకున్నారు.

అయితే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇతర పథకాలలో..  అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్), ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ వంటి పథకాలలో రిజిస్టర్ అయిన వారు మాత్రం ఈ స్కీమ్ నమోదుకు అనర్హులు. ఇక ఈ స్కీమ్ లో  ప్రీమియం ఎంత అంటే.. ఈ పథకంలో చేరే రైతు వయసును బట్టి ప్రీమియం ఉంటుంది. అయితే అందుకు రూ. 55 నుంచి రూ. 200 వరకూ ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ రైతు 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో  చేరితే రూ. 55 ప్రీమియం, 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 200 వరకు రైతు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వీరికి 60 ఏళ్లు నిండాక ప్రతి నెలా రూ. 3000 వరకూ పింఛన్ కూడా అందుతుంది. అంతేకాకుండా..  ఒకవేళ రైతు చనిపోతే భార్యకు ప్రతినెలా రూ.1500 వరకు పింఛన్ కూడా వస్తుంది. అయితే అందుకు  ఈ పత్రాలు కావాల్సి ఉంటుంది.

ఇక ఈ పథకం కోసం  నమోదు చేసుకొనే రైతుకు ఈ పత్రాలు కావాల్సి ఉంటుంది.  2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, వయస్సు సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పంట పొలాల ఖస్రా ఖాతాని, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి. అలాగే కనీసం ఈ స్కీమ్ ఐదేళ్లు కట్టాలి. అప్పుడు రైతు చనిపోయినా కూడా వారి జీవిత భాగస్వామి ఈ పథకం కొనసాగించొచ్చు. అయితే రైతు కనీసం ఐదేళ్ల వరకూ తన ప్రీమియంను నిర్ధేశిత తేదీ ప్రకారం చెల్లించి ఉండాలి. వయసు నిండిన తర్వాత రైతు చనిపోతే.. ఆ రైతు జీవితభాగస్వామికి సగం పింఛన్ ఇస్తారు. మరి, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.