Arjun Suravaram
మనిషిలో దేవుడు ఉంటాడని చాలా మంది చెబుతుంటారు. అలానే కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు మనకు అలానే అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తిని చూస్తే మనిషి రూపంలో ఉన్న దేవుడా అని అనకమానలేరు. మరి.. ఆయన ఏం చేశాడంటే..
మనిషిలో దేవుడు ఉంటాడని చాలా మంది చెబుతుంటారు. అలానే కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు మనకు అలానే అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తిని చూస్తే మనిషి రూపంలో ఉన్న దేవుడా అని అనకమానలేరు. మరి.. ఆయన ఏం చేశాడంటే..
Arjun Suravaram
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు మండే అగ్నిగోళం కంటే ఘోరంగా కనిపిస్తున్నాయి. భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది కంటే ఈ ఏటా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందే భయపడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి ఎండల్లో ప్రజలకు ఓ వ్యక్తి దేవుడిలా కనిపిస్తున్నాడు. కారణంగా మండే ఎండల భయంకి అందరూ ఇళ్లలో ఉండే ఆ వ్యక్తి మాత్రం గొప్ప పని చేసి.. అందరిని ఆకట్టుకున్నాడు. మరి.. ఆయన చేసిన పని ఏమిటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతంలో ఎన్ రాఘవన్ ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నాడు. ఆయన తన కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కేవలం ఉద్యోగమే కాకుండా సమాజ సేవ చేస్తుంటారు. ముఖ్యంగా రాఘవ్ ప్రకృతి ప్రేమికుడు. మొక్కలను పెంచడం, ప్రకృతిని కాపాడం కోసం తన వంతు కృషి చేస్తుంటాడు. ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇలా సమాజ సేవ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న మండే ఎండలకు అందరు భయంతో వణికిపోతుంటే.. రాఘవన్ మాత్రం దేవుడిలా మొక్కలకు నీళ్లు పోస్తు తనవంతు సమాజానికి సహయం చేస్తున్నారు. 4 వేల మొక్కలను నీరు పోస్తూ..తన వంతుగా ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
గతేడాది కర్నాటక ప్రభుత్వం , ఆ రాష్ట్ర అటవీ శాఖ మైసూర్ ప్రాంతంలో 4 వేల మొక్కలను నాటించింది. అంతేకాక వాటికి నిత్యంగా వాటికి వాటర్ ట్యాంకర్ తో నీటిని సప్లయ్ చేస్తుంది. అయితే నగరానికి చెందిన రాఘవన్ ఈ మొక్కల సంరక్షణ చూస్తున్నారు. ఈ వేసవి నెలలు మొత్తం అతను ఆ మొక్కలు నీరు పోస్తున్నాడు. రాఘవన్ రోజూ నీటి ట్యాంకర్లతో నీరు పోసి డిపార్ట్‌మెంట్‌కు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే నాటిన చెట్లతో పాటు, ఈ ఏడాది ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి నాటిన 1,000కు పైగా కొత్త మొక్కల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మహోగని, వేప, ఇండియన్ బీచ్ బసవనపాద, నేరేలు, కడ్బద్మి వంటి వివిధ రకాల మొక్కను అటవీశాఖ నాటింది.
వేసవికాలం ప్రారంభమైన మార్చి నుండి మే వరకు ఈ మొక్కలు నీరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ చెట్లు వాటి పెరుగుదల, అభివృద్ధికి ఏడాది ప్రారంభంలో పలు సార్లు నీటిని సప్లయ్ చేయాలి. సాధారణంగా మొక్కలు నాటినప్పుడు అవి బలంగా పెరిగే వరకు అటవీ శాఖ వాటి సంరక్షణ చూసుకుంటుంది. ఈ సంవత్సరం అనూహ్యంగా వేడి వాతావరణం, ఉష్ణోగ్రతలు మొదటిసారిగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరగడం, వృక్షసంపదను బాగా ప్రభావితం చేసింది, ఇది తగినంత నీరు లేనందున చిన్న చెట్లు వాడిపోవడానికి దారితీసింది. అందుకే మొక్కల సంరక్షణకు ప్రభుత్వంతో పాటు రాఘవన్ చర్యలు తీసుకుంటున్నాడు. మండే ఎండలకు మొక్కలను నీరు అందిస్తూ.. అక్కడి ప్రజలకు రాఘవన్ దేవుడిగా మారారు. మరి.. ఇలా నిస్వార్థంతో సమాజం కోసం పని చేసే రాఘవన్ లాంటి వ్యక్తులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.