Venkateswarlu
Venkateswarlu
ఆమె ఓ ఫార్మా ఉద్యోగిని.. ఆమెకు చిన్నప్పటినుంచి వంట చేయటం అంటే పిచ్చి. అందుకే.. పొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వర్కుతో సతమతమవుతూ ఉంటుంది. అయినా కూడా తన ప్యాషన్ వైపు అడుగు వేసింది. రోడ్డు పక్క చిన్న పాస్తా కొట్టు పెట్టింది. సాయంత్రం వరకు ఆఫీస్‌లో పని చేస్తూ.. రాత్రి వేళల్లో పాస్తా తయారు చేసి అమ్ముతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ధృవీ పాంచాల్ జిడూస్ కంపెనీలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. ధృవీకి చిన్నప్పటినుంచి వంట చేయటం అంటే చాలా ఇష్టం.
అందుకే తన ప్యాషన్‌ను నెరవేర్చుకోవటానికి రోడ్డు పక్క పాస్తా కొట్టుపెట్టింది. సాయంత్రం వరకు ఆఫీస్‌లో పని చేసి.. ఆ తర్వాత పాస్తా అమ్ముతూ ఉంటుంది. అలా ఆమె పేరు ఆ చుట్టు పక్కల మారుమోగిపోయింది. ఆమె చేసే వంట కూడా బాగా ఉంటుండంతో కస్టమర్ల సంఖ్య బాగా పెరిగింది. యూత్ ఎక్కువగా ఆమె కొట్టు దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె పాస్తా తయారు చేసి అమ్ముతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ది ఫుడ్ యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘‘ బతుకు దెరువు వేరే.. ప్యాషన్ వేరే.. ప్యాషన్ కోసం పని చేసే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, తన ప్యాషన్ గురించి ధృవీ పాంచాల్ మాట్లాడుతూ.. ‘‘ వంట పట్ల నాకున్న ప్యాషన్‌ను ఈ పని పూర్తి చేస్తోంది. వంట చేసి ప్రజలకు అందించటం వల్ల ఎంతో సంతోషం కలుగుతోంది’’అని పేర్కొంది. మరి, ఓ వైపు ఫార్మా కంపెనీలో పని చేస్తూ.. మరో వైపు పాస్తా అమ్ముతున్న ధ్రువీ పాంచాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.