Krishna Kowshik
అంబర్ పేట, మొన్న శంషాబాద్ వీధి కుక్కల దాడి ఘటనల్లో చిన్నారులు మృతి చెందారు. ఈ రెండు ప్రాంతాలే కాదు.. ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ డాగ్స్ దాడిలో అనేక మంది పిల్లలు మరణించారు.
అంబర్ పేట, మొన్న శంషాబాద్ వీధి కుక్కల దాడి ఘటనల్లో చిన్నారులు మృతి చెందారు. ఈ రెండు ప్రాంతాలే కాదు.. ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ డాగ్స్ దాడిలో అనేక మంది పిల్లలు మరణించారు.
Krishna Kowshik
గత ఏడాది వీధి కుక్కల దాడిలో తెలంగాణలోని అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఒక్క ఘటనే కాదు.. వరుసగా పలు సంఘటనలు కలవరపాటుకు గురిచేశాయి. ఏపీలో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయి. తాజాగా శంషాబాద్‌లో కూడా ఓ బాలుడు కుక్కల కరవడంతో మరణించాడు. చర్యలు చేపట్టినప్పటికీ.. వీటి దాడి ఆగలేదు. కేవలం రోడ్డుమీద, సామాన్యులు లేదా మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు.. హై క్లాస్ సొసైటీల్లో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఓ సొసైటీలో లిఫ్టులో ఓ చిన్నారిపై కుక్క విచక్షణ రహితంగా కరిచింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. బాలికపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మే 3న ఈ ఘటన జరగ్గా.. లిఫ్టులో ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ -300 సొసైటీలో ఈ దాడి జరిగింది. అందులో పాప..గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వెళ్లేందుకు నాలుగో అంతస్తులో లిఫ్ట్ ఎక్కింది. లిఫ్టులో వెళుతుండగా.. ఓ ఫ్లోరులో ఆగింది. కాగా, అందులోకి ఎంటర్ అయ్యింది బ్రౌన్ పెంపుడు కుక్క. అంతలో డోర్ క్లోజ్ కావడంతో చిన్నారిని కరిచింది. పాప విలవిలలాడుతూ కనిపించింది. కాగా, ఓ వ్యక్తి ఇది గమనించి.. లిఫ్ట్ లోపల ఉన్న కుక్కను బయటకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది.
లిఫ్ట్ డోర్ మూసేటప్పుడు కూడా అందులో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించింది ఈ డాగ్. కాగా, ఇది యజమాని నిర్లక్ష్యంగా చెబుతున్నారు కొందరు. ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని కుక్కలను కూడా ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంటూ.. వాటిని నిషేధించాలని సిఫార్సు చేసింది. రోట్ వీలర్, పిట్ బుల్, అమెరికన్ బుల్ డాగ్ వంటి డాగ్స్ ప్రమాదకరమైనవిగా పేర్కొంది. సొసైటీల్లో పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వీధి కుక్కల నుండి చిన్నారిని కాపాడేది ఎవరంటూ చర్చించుకుంటున్నారు. ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కలతో సైతం జాగ్రత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, దీపిపై రెసిడెన్షియల్ సొసైటీ,పాప తల్లిదండ్రులు, నోయిడా పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
In Lotus 300 Society located in Sector 107 of Noida, a dog entered the lift and Bit, scratched a girl
pic.twitter.com/VurplrEJVF— Ghar Ke Kalesh (@gharkekalesh) May 8, 2024