iDreamPost
android-app
ios-app

లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ?.. కారణమేంటంటే?

దేశ రాజధాని ఢిల్లీలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరాడక విలవిల్లాడిపోతున్నారు. దీంతో అధికారులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరాడక విలవిల్లాడిపోతున్నారు. దీంతో అధికారులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ?.. కారణమేంటంటే?

దేశ రాజధాని ఢిల్లీలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరాడక విలవిల్లాడిపోతున్నారు. దీంతో అధికారులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమయ్య మాత్రం తీరడం లేదు. నేడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీలో గాలి నాణ్యతను పరిశీలించగా 273గా నమోదైంది. గాలి నాణ్యత అత్యంత పేలవంగా మారడంతో ప్రజలు ఊపిరాడక తల్లడిల్లారు.

ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఢిల్లీ విశ్వ విద్యాలయం, న్యూ ఢిల్లీలోని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత కలుషితంగా మారిపోయింది.ఆయా ప్రాంతాల్లో ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీ) 273,173 గా నమోదైంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాస సంబంధిత వ్యాధుల భారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దసరా పండగ పురస్కరించుకుని బాణాసంచా కాల్చడంతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.ఓ వైపు పొగమంచు మరోవైపు బాణాసంచా కాల్చడం వల్ల ఏర్పడిన పొగతో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ఢిల్లీలో గాలి నాణ్యత మ‌రింత దారుణంగా ప‌డిపోయే అవకాశం ఉందని ఢిల్లీకి కేంద్రం ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టం వెల్లడించింది.

అయితే గాలి నాణ్యత సున్నా నుంచి 50 ఏక్యూఐ నాణ్య‌త‌ మంచిగా ఉంద‌ని తెలియ‌జేస్తుంది. 51 నుంచి 100 సంతృప్తికరంగా, 101 నుంచి 200 మధ్యస్థంగా, 201 నుంచి 300 వరకు పేలవంగా, 301 నుంచి 400 వరకు చాలా పేలవంగా, 401 నుంచి 500 వరకు తీవ్రంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. కాగా రాజధాని నగరంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వాడకంపై సమగ్ర నిషేధాన్ని విదించింది ప్రభుత్వం. నవంబర్ 1 నుంచి ఢిల్లీలో డీజిల్ తో నడిచే బస్సులను సైతం నిషేదిస్తున్నట్లు తెలిపారు.