Arjun Suravaram
ఇండియన్ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. అలానే మన ఇండియన్ రైల్వే ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. తాజాగా ఓ కొత్త అప్ డేట్ తో రైల్వే శాఖ మన ముందుకు వచ్చింది.
ఇండియన్ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. అలానే మన ఇండియన్ రైల్వే ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. తాజాగా ఓ కొత్త అప్ డేట్ తో రైల్వే శాఖ మన ముందుకు వచ్చింది.
Arjun Suravaram
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి పెద్ద వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం ఎంతో మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే మిగత జర్నీలతో పోలిస్తే.. రైలు ప్రయాణం కాస్తా చౌకగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ట్రైన్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..ట్రైన్ ప్రయాణంలో వివిధ తరగతుల బోగీలు ఉంటాయి. చాలా మంది స్లిపర్ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ జర్నీలు చేస్తుంటారు. అయితే అలానే స్లీపర్ టికెట్ తోనే ఏసీ కోచ్ లో కూడా ప్రయాణం చేయవచ్చు. అయితే అది ఎలా సాధ్యం, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం వేసవి కాలం సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమ్మర్ హాలీడేస్ ను సొంత గ్రామాల్లో, ఇతర ప్రదేశాల్లో గడపాలనే భావిస్తుంటారు. ఇక వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఏసీ తరగతి టికెట్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. అలానే ఈ మండే వేసవిలో స్లిపర్ కోచ్ లల్లో ప్రయాణించడం చాలా కష్టం. ఇలాంటి సమయంలో స్లీపర్ కోచ్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణించవచ్చు. అది ఎలా సాధ్యం అనే సందేహం మీకు రావచ్చు. అసలు అలా స్లిపర్ కోచ్ టికెట్ తో ఏసీలో కోచ్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
రైలులో స్లీపర్ కోచ్ టికెట్‌ను బుక్ చేసుకోవడం ద్వారా కూడా ఏసీ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. ఈ సందర్భంలో మీరు ఒక పని మాత్రమే చేయాలి. టికెట్ బుకింగ్ సమయంలో “ఆటో-అప్‌గ్రేడ్” అనే ఆప్షన్ ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆటో అప్ గ్రేడ్ అనే ఆప్షన్ పై ఎంపికను టిక్ చేయాలి. దీంతో స్లిపర్ టికెట్ తోనే ఏసీలో ప్రయాణం చేయవచ్చు. ఏదైనా స్లీపర్ క్లాస్ అనే కాదు. ఉన్నత తరగతి సీటు లేదా బెర్త్ ఖాళీగా ఉంటే, ప్రయాణీకుల టికెట్ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేయబడుతుంది. అయితే ఆటో అప్ గ్రేడ్ అనే ఆప్షన్ పై టికెట్ చేసిన వారికి మాత్రం ఈ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
విమానాల్లో ఎకానమీ నుంచి బిజినెస్ క్లాస్‌కు టికెట్‌ను అప్‌గ్రేడ్ చేసే సంగతి అందరికి తెలిసిందే. అదే విధంగా రైళ్లలో కూడా ఇప్పుడు స్లీపర్ కోచ్ నుంచి ఏసీ కోచ్‌కు టికెట్లు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌గ్రేడ్ కోసం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రైల్వే శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ను మాత్రం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇలా మన ఇండియన్ రైల్వే ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈసారి భారతీయ రైల్వే కూడా ఈ ఉచిత అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.