iDreamPost
android-app
ios-app

విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన! ఏం చేశాడో తెలుసా?

  • Published Oct 01, 2023 | 4:51 PM Updated Updated Oct 01, 2023 | 4:51 PM
  • Published Oct 01, 2023 | 4:51 PMUpdated Oct 01, 2023 | 4:51 PM
విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన! ఏం చేశాడో తెలుసా?

విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తనకు ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అతడి చేసిన పనికి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో అప్రమత్తమై భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అతడికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా సరే అతగాడి తీరు మాత్రం మారలేదు. ఇక విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. విమానంలోకి వెళ్లిన పోలీసులు వింతగా ప్రవర్తించిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ ఖంగుతిన్నారు. అసలేం జరిగిందంటే?

ఓ మీడియా కథనం ప్రకారం.. ఇటీవల హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరిన ఇండిగో విమానంలో అందరితో పాటు ఓ ప్రయాణికుడు వెళ్లాడు. ఇక ఓ అరగంట తర్వాత ఆ ప్రయాణికుడు అందరితో కాస్త వింతగా ప్రవర్తించాడు. ఇంతే కాకుండా విమానంలో ఉన్న టాయిలెట్ లోకి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి చాలా సేపైన తిరిగి బయటకు రాలేదు. దీంతో విమానంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు రావాలంటూ చెప్పారు. అయినా అతగాడు ఎంతకు బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు.

దీంతో విసుగిపోయిన ఆ సిబ్బంది.. విమానం పాట్నా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విమానంలోకి వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు ఆ ప్రయాణికుడిని టాయిలెట్ నుంచి బయటకు రప్పించారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే? ఆ ప్రయాణికుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఇలా చేశాడని అదే విమానంలో ప్రయాణించిన అతని సోదరుడు తెలిపాడు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారతోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibom