iDreamPost
android-app
ios-app

కర్ణాటకలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు!

Karnataka: తరచూ కొందరు చెత్త వెదవలు మనదేశంలో బతుకుతూ.. శత్రు దేశమైన పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేస్తుంటారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ ఎంపీ అనుచరలు పాక్ కి అనుకూలంగా స్లోగన్స్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Karnataka: తరచూ కొందరు చెత్త వెదవలు మనదేశంలో బతుకుతూ.. శత్రు దేశమైన పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేస్తుంటారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ ఎంపీ అనుచరలు పాక్ కి అనుకూలంగా స్లోగన్స్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటకలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు!

భారతదేశానికి, పాకిస్థాన్ కి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే. తన అభివృద్ధి కంటే పక్కవారిని నాశనం చేసే పనిలో పాక్ ఉంటుంది. ముఖ్యంగా భారత్ అంటే.. ఆ దేశానికి ఎక్కడ లేని అసుయా. అందుకే భారత్ పై తరచూ ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇది ఇలాంటే..తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు మన దేశంలోనే ఉంటూ.. కొందరు ద్రోహులు పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేస్తారు. ఇలాంటి దేశ విద్రోహక నినాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో పాకిస్థాన్  జిందాబాద్ అంటూ ఓ ఎంపీ అనుచరులు నినాదాలు చేసినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై  అందరిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఫిబ్రవరి 27న దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలానే కర్నాటకలో కూడా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానం బీజేపీ గెలుచుకోగా, మరో స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ తరపున సయ్యద్ నజీర్ హుస్సేన్ పోటీ చేసి విజయం సాధించారు. ఇక నజీర్ గెలిచిన సందర్భంగా ఆయన అనుచరలు పాకిస్థాన్ జిందాబాద్ ఉంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పలు ఛానళ్లు ప్రసారం చేశాయి.

దీంతో ఈ  వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. అయితే ఇలా ప్రజాప్రతినిధి అనుచరలు పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేయడం పెనుదుమారం రేపుతోంది. నిందితులను అరెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఎంపీ నజీర్ అనుచరులు పాకిస్థాన్ కి అనుకూలంగా నినాదాలు చేయడం కర్నాటక అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. ప్రతిపక్ష బీజేపీ సభ్యలు ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాక బీజేపీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు.

దీంతో అధికార కాంగ్రెస్ కూడా బీజేపీపై ఎదురు దాడికి దిగింది. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాక్ కి అనుకూలం నినాదాలు వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో స్పందించారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురూ చూస్తున్నారని ఆయన తెలిపారు. ఆ నివేదిక వస్తే..ఆ నినాదలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని మంత్రి అన్నారు. ఇది నిజమని తేలితే దోషులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.