Arjun Suravaram
Oyo Rooms In Kerala: ఓయోలో రూమ్ బుక్ చేసుకున్న వ్యక్తి..ఓ హోటల్ యాజయమాని రూమ్ ఇవ్వలేదు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించగా ..హోటల్ యాజమానికి భారీ షాక్ తగిలింది.
Oyo Rooms In Kerala: ఓయోలో రూమ్ బుక్ చేసుకున్న వ్యక్తి..ఓ హోటల్ యాజయమాని రూమ్ ఇవ్వలేదు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించగా ..హోటల్ యాజమానికి భారీ షాక్ తగిలింది.
Arjun Suravaram
ఓయో రూమ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. ఎవరైనా దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడే రాత్రి బస చేయడానికి ఓయో ద్వారా రూమ్స్ ను బుక్ చేసుకుంటాము. ఓయో సంస్థ హోటల్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు దాదాపు అన్నిచోట్ల ఓయో రూంలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కూడా తన ముందుగానే ఆన్ లైన్ ద్వారా ఓయో రూం బుక్ చేసుకున్నాడు. అక్కడి వెళ్లగా..సదరు హోటల్ ఓనర్ రూమ్ ఇవ్వలేదు. ఆ తరువాత సదరు వ్యక్తి..ఏకంగా కోర్టు మెట్లు ఎక్కి.. హోటల్ యజమానికి భారీ షాకిచ్చాడు. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన అరుణ్ దాస్ అనే వ్యక్తి కొల్లాం ప్రాంతానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడే మంగలాట్ అనే హోటల్ లో ఓయో రూం బుక్ చేసుకున్నాడు. ఒక్క రాత్రి ఉండేందుకు ఓయో వెబ్‌సైట్ ద్వారా రూమ్ బుక్ చేసుకుని రూ.2933 చెల్లించాడు. ఈ క్రమంలోనే అరుణ్.. తన భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిపి 10 మంది కుటుంబ సభ్యులు రాత్రి 10గంటల సమయంలో ఆ హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడి వెళ్లిన తరువాత హోటల్ నిర్వాహకులు అరుణ్ కి షాకిచ్చారు.
అరుణ్ కుటుంబ సభ్యులకు రూమ్ ఇచ్చేందుకు ఆ అంగీకరించలేదు. దీంతో అతడు ఆ రాత్రి వేరే హోటల్ కి వెళ్లి బస చేశాడు. అయితే తనకు జరిగిన నష్టం పై వినియోగదారుల ఫోరమ్ లో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో అనేక విషయాలను బాధితుడు ప్రస్తావించాడు. గది కావాలంటే ఒక్కో రూమ్‌కు రూ.2500 అదనంగా ఇవ్వాలని హోటల్ ఓనర్ డిమాండ్ చేశాడని బాధితుడు పేర్కొన్నాడు. ఈ కారణంగా తన కుటుంబ సభ్యులు మొత్తం 10 మంది రాత్రంతా తిరుగుతూ మరో రూం వెతుక్కునేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపాడు. దీంతో ఎర్నాకులం జిల్లా వినియోగదారుల కోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు..సదరు హోటల్‌కు రూ.1.10 లక్షలు జరిమానా విధించింది.
ఇందులో బాధితుడికి పరిహారం కింద లక్ష, కోర్టు ఫీజుల కింద మరో రూ.10 వేలను నెల రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక విచారణ సమయంలో హోటల్ యజమాని కూడా పలు అంశాలను ప్రస్తావించాడు. తమ హోటల్, ఓయో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదని, అందుకే తాను రూం ఇవ్వలేదని కోర్టులో తెలిపాడు. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయాడు. దీంతో అతనికి కోర్టు భారీగా జరిమానా విధించింది. ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అర్ధరాత్రి ఇబ్బందులు పడుతూ మానసికంగా తీవ్ర క్షోభకు గురైందని జడ్జీ తెలిపారు. అందుకే ఆ హోటల్ యజమానికి రూ.1.10 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.