P Venkatesh
రాష్ట్రపతి భవన్ లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో చిరుత కనిపించిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రపతి భవన్ లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో చిరుత కనిపించిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
P Venkatesh
ఇటీవల దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 545 పార్లమెంట్ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెల్లడయ్యాయి. రాష్ట్రపతిభవన్ లో జూన్ 09వ తేదీ సాయంత్రం 7 గంటలకు పలువురు ప్రముఖులు హాజరవ్వగా వారి సమక్షంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ ఎన్నిల్లో గెలుపొందిన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టాంటా వైరల్ గా మారింది. వీవీఐపీ రూమ్ లో చిరుత లాంటి ఓ జంతువు స్వేచ్ఛగా తిరుగుతుండటం వీడియోలో రికార్డు అయింది. తాజాగా దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్ లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎంపీలు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనకాల చిరుత పులి సంచరిస్తున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా అది చిరుత పులే అని అనుకున్నారు. అయితే తాజాగా ఢిల్లీ పోలీసులు స్పందించారు. అసలు నిజాన్ని అధికారులు వెల్లడించారు. ఆ వీడియోలో కనిపించింది చిరుత పులి కాదని అది సాధారణ పిల్లి అని తెలిపారు. పలు న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అది కౄర జంతువుగా ప్రచారం చేశారని, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ లో చిరుత సంచారం అన్న ప్రచారానికి తెరపడింది.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
— We, the people of India (@India_Policy) June 10, 2024