నీట్ యూజీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

NEET UG 2024 Result: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఎన్టీఏ నీట్ పరీక్షా ఫలితాలను సెంటర్ల వైజ్ విడుదల చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

NEET UG 2024 Result: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఎన్టీఏ నీట్ పరీక్షా ఫలితాలను సెంటర్ల వైజ్ విడుదల చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో ఎక్కువ వైరలైన, చర్చనీయాంశంగా మారిన వాటిల్లో నీట్ యూజీ 2024 పరీక్షల అంశం. గతకొన్ని రోజుల నుంచి ఈ పరీక్షపై అనేక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసింది. నీట్ 2024 పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా రచ్చ జరగింది. ఈ కేసులో పలువురు పోలీసులు అరెస్టు కూడా చేశారు. అలానే ఈపరీక్షకు సంబంధించి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సైతం విచారణలు జరిగాయి. ఈ క్రమంలోనే  తాజాగా నీట్ యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇక ఈ రిజల్ట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శనివారం నీట్ యూజీ 2024 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇక నీట్ 2024 రిజల్ట్స్ ను neet.ntaonline.inలో చెక్ చేసుకోవచ్చు. జూలై 18న నీట్ పరీక్ష ఫలితాల అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. నీట్ యూజీ ఫలితాలను జూలై 20 మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రకటించాలని ఎన్టీఏను ఆదేశించింది. అలానే విద్యార్థులు పొందిన మార్కులను తన వెబ్‌సైట్‌లో ప్రచురించాలని తెలిపింది. అదే విధంగా విద్యార్థుల గుర్తింపును వెల్లడించవద్దని సుప్రీంకోర్టు ఏజెన్సీని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నీట్ యూజీ ఫలితాలను పై కీలక ఆదేశాలను జారీ చేసింది. జూలై 20 తేదీన మధ్యాహ్నాం లోపు  నగరాల్లో కేంద్రాల వారీగా వేర్వేరుగా ప్రచురించాలని ఆదేశించింది.

ఈ సంవత్సరం, నీటీ యూజీ పరీక్షను మే 5న 4,750 కేంద్రాల్లో ఎన్టీఏ నిర్వహించింది.  వీటి ఫలితాలు ఫలితాలు 2024 జూన్ 4న  వెలువడ్డాయి. పేపర్ లీక్ వ్యవహారంలో 1563 మందికి మరోసారి ను జూన్ 23న ఎన్టీఏ నిర్వహించింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ 2024జూన్ 30న విడుదలయ్యాయి. ఈ సంవత్సరం ప్రధాన పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు, 1563 మంది అభ్యర్థులు రెండోసారి పరీక్ష రాశారు. ఇక నీట్ యూజీ పరీక్ష రద్దు, పునఃపరీక్ష, అక్రమాస్తుల ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు జూలై 22న తుది తీర్పును వెలువరించనుంది.

Show comments