UPI ID: రేపే లాస్ట్ డేట్.. ఇలా చేయకపోతే UPI పేమెంట్స్ ఆగిపోతాయి!

రేపే లాస్ట్ డేట్.. ఇలా చేయకపోతే UPI పేమెంట్స్ ఆగిపోతాయి!

UPI ID: ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ చేస్తుంటారు.

UPI ID: ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ చేస్తుంటారు.

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా వస్తువుల కొనుగోలు, నగదు బదిలీలు చేసేవారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో ఈ యూపీఐ యాప్సే కనిపించేవి. మనీ ట్రాన్సాక్షన్స్​ కోసం చాలా మంది వీటిని తెగ వాడేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఒకప్పుడూ వీడిని వాడినా, ఇప్పుడు మాత్రం వీటిని ముట్టుకోవడం లేదు.  ఇలాంటి వారి జాబితాలో మీరు కూడా ఉన్నారా? . అయితే మీకు కూడా ఓ హెచ్చరిక ఉంది. ఏడాదికి పైగా యాక్టివ్ గా లేని యూపీఐ ఐడీలను, డిసెంబర్ 31 నాటికి డిసెబుల్ చేయనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఏడాదికిపైగా ఇనాక్టివ్​గా ఉన్న ఫోన్ పే, గూగుల్, పేటీఎం వంటి యూపీఐ ఐడీలను.. డిసెంబర్​ 31 నాటికి  రద్దు చేయాలని నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎన్ పీసీఐ) నిర్ణయించింది. అయితే మీ యూపీఐ డిసెబుల్ కాకుండా ఉండటానికి ఓ మార్గం ఉంది. డిసెంబర్ 31 వరకు సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు ఐడీలు యాక్టీవ్ లేని వారు..వాటిని యాక్టీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు త్వరగా స్పందించకపోతే.. మీ యూపీఐ ఐడీ డిసేబుల్​ అయిపోతుంది. మీరు  నగదను సదరు యూపీఐ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్​ చేయలేరు.

చాలా మంది మొబైల్ నెంబర్లు మార్చిన తర్వాత, వాటిని బ్యాంక్​ ఖాతాలకు లింక్​ చేయట్లేదు. ఈ కారణంతో బ్యాంకులోని ఖాతలకు పాత నంబర్లే ఉంటున్నాయి. పాత ఫోన్​ నెంబర్లను 90 రోజుల తర్వాత వేరే వినియోగదారులకు  టెలికాం సంస్థలు అసైన్​ చేసేస్తాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లకు తెలియకుండా నగదలు బదిలీ తప్పుగా జరగకుండా చూసుకునేందుకు, యూపీఐ ఐడీలను డీయాక్టివేట్​ చేయాలని ఎన్ పీసీఐ నిర్ణయించింది. సంవత్సరం పాటు వాడని యూపీఐ ఐడీలు ఆదివారం నాటికి డిసేబుల్ అవుతాయి. ఈ లోపు వాటిని వినియోగించాలి.

అంతేకాకుండా మీ యూపీఐ ఐడీలకు లింక్​ చేసి ఉన్న అన్ని ఫోన్​ నెంబర్లను చెక్  చేసుకోవడం మంచింది. ఆ నెంబర్లు మూడు నెలలకు మించి ఇనాక్టివ్​గా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన యూపీఐ ఐడీలు డీయాక్టివేట్​ అయ్యే ప్రమాదం ఉండదు. అంతేకాక మీకు తెలియకుండా నగదు బదిలీ​ జరిగే అవకాశం ఉండదు. నిజానికి ఈ యూపీఐ ఐడీలను గుర్తించేందుకు ఎన్ పీసీఐ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల సాయం తీసుకుంటుంది. ఈ ఐడీలు  యూపీఐ నెంబర్లు, మొబైల్ నంబర్లతో లింకై ఉంటాయి. ఏడాది కాలం పాటు మనుగడలో  లేని యూపీఐ ఐడీలను తొలగించేందుకు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి.

ఒక్కసారి యూపీఐ ఐడీలు డిసెబుల్​ అయిపోతే, సంబంధిత ఫోన్​ నంబర్లు డీ-రిజిస్టర్​ అవుతాయట. ఇలా బ్లాక్​ అయిపోయిన యూపీఐ ఐడీలు, ఫోన్​ నెంబర్లను తిరిగి పొందాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. డి యాక్టీవేట్ అయిన ఐడీలను కస్టమర్లు పొందాలంటే యూపీఐ యాప్స్​లోకి వెళ్లాలి. అక్కడ మళ్లీ రీ-రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా తిరిగి మళ్లీ పొందవచ్చు. మొత్తంగా మీ యూపీఐ  ఐడీ డిసెబుల్ కాకుండా రేపటి వరకు గడువు ఉంది. కాబట్టి త్వరపడి.. మీ యూపీఐ ఐడీ  డి యాక్టీవ్ కాకుండా చూసుకోండి. ఎన్ పీసీఐ ఇచ్చిన ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments