ఢిల్లీ రాజకీయాల్లో కల్లోలం! ఒకే విమానంలో నితీష్‌ కుమార్‌, తేజస్వీ యాదవ్‌!

Nitish Kumar, Tejashwi Yadav, NDA, INDIA Alliance: కేంద్ర రాజకీయాల్లో ఏదో కల్లోలం వచ్చేలానే కనిపిస్తోంది. తాజాగా నితీష్‌ కుమార్‌, తేజస్వీ యాదవ్‌ ఒకే విమానంలో ప్రయాణించడం బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Nitish Kumar, Tejashwi Yadav, NDA, INDIA Alliance: కేంద్ర రాజకీయాల్లో ఏదో కల్లోలం వచ్చేలానే కనిపిస్తోంది. తాజాగా నితీష్‌ కుమార్‌, తేజస్వీ యాదవ్‌ ఒకే విమానంలో ప్రయాణించడం బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమి సాధించింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను బీజేపీ సొంతంగా సాధించడంలో విఫలం కావడంతో.. మరోసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఎన్డీయే కూటమి 293 సీట్లు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు.. ఢిల్లీలో మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఢిల్లీలో మీటింగ్‌ పెట్టింది. ఈ మీటింగ్‌కు బిహార్‌ నుంచి జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ బయలుదేరి వెళ్లారు.

అయితే ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణించడం, పైగా ముందు వెనుక సీట్లలోనే కూర్చోని వెళ్లడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయం వేడేక్కింది. ఎందుకంటే.. నితీష్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఎన్డీయే కూటమిలో ఉంటే, తేజస్వీ యాదవ్‌ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. ఇద్దరు వేర్వేరు కూటముల్లో ఉన్న కీలక నేతలు ఒకే విమానంలో ప్రయాణిస్తూ.. కీలక మీటింగ్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రయాణం బీజేపీ గుండెళ్లో రైళ్లు పరిగెట్టేస్తోంది. ఎన్డీయే కూటమి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నితీష్‌కుమార్‌ చాలా కీలకంగా మారనున్నారు. అలాంటి నేతతో తేజస్వీ యాదవ్‌ ఏమైనా చర్చలు జరిపి.. ఇండియా కూటమి వైపు మళ్లిస్తే.. బీజేపీ పని అయిపోయినట్లే అని ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే.. నితీష్ కుమార్‌ చాలా కాలంగా ఒక పార్టీతో పొత్తులో లేరు. ఒకసారి కాంగ్రెస్‌తో, మరోసారి బీజేపీతో, ఇంకోసారి ఆర్జేడీతో ఇలా ఇష్టమొచ్చినట్లు పొత్తులు పెట్టుకున్న నేతగా నితీష్‌కుమార్‌ విశ్వసనీయత కాస్త దెబ్బతింది. ఇప్పుడు ఎంతో కీలకమైన సమయంలో ఇండియా కూటమిలో భాగమైన ఆయన.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి ఢిల్లీకి ఒకే విమానం ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు విమానం దిగి ఎవరి కూటమి మీటింగ్‌కు వారు వెళ్లినా.. అక్కడ ఏం చెబుతారో అనే ఆందోళన అయితే అందరిలో నెలకొంది. ఇండియా కూటమి ఏదైనా భారీ పోస్ట్‌ ఆఫర్‌ చేస్తే.. నితీష్‌ కుమార్‌ ఇండియా కూటమికి సపోర్ట్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి నితీష​ కుమార్‌, తేజస్వీ యాదవ్‌ ఒకే విమానంలో ఢిల్లీకి ప్రయాణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments