P Krishna
Bengaluru Cafe Blast: ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లో పలు ఉగ్రవాద సంస్థలకు అమాయకులను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
Bengaluru Cafe Blast: ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లో పలు ఉగ్రవాద సంస్థలకు అమాయకులను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
P Krishna
ఇటీవల దేశంలో పలు చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దేశంలో పలు చోట్ల విధ్వంసాలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉగ్రవాదులు దాడులు చేయడానికి కారణాలు ఏవైనా.. బలి అవుతుంది మాత్రం ఎంతోమంది అమాయక ప్రజలు. ఇటీవల ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటారా? లేదా? అన్న భయంతో రోజులు వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వైపు నుంచి ఉగ్రమూకలు దాడులకు తెగబడతారో తెలియని పరిస్తితి. ఈ మధ్యనే బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన తీవ్ర సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించారు. వివరాల్లోకి వెళితే..
మార్చి 1వ తేదీనా బెంగుళూరు లోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. పరుగులు తీశారు. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నింధితుల వేటలో పడింది. ఈ క్రమంలో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లోని 18 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా ఎన్ఐఏ మరో పురోగతి సాధించింది. బాంబు పేలుడు కోసం పేలుడు పదార్ధాలు, సాంకేతిక పరికరాలు సరఫరా చేసిన ముజిమ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ముజిమ్మిల్ వద్ద నుంచి నగదుతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడికి సూత్రదారులు సాజిబ్ హుస్సేన్, అబ్బుల్ మంతెన్ ఇంకా పరీరీలో ఉన్నారు. పేలుడు లో అత్యాధునిక ఎక్స్ ప్లోజీవ్ డివైజ్ (IED) ని ఉగ్రవాదులు ఉపయోగించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రామేశ్వం కేఫ్ లో కస్టమర్ వేశంలో వచ్చిన నింధితుడు అప్పటికే బ్యాగ్ లో బాంబ్ ఫిక్స్ చేసి అక్కడే వదిలి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి బాంబు పేలింది. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.