తెలంగాణ నుండి మరో వందే భారత్ రైలు.. ఈ రూట్‌లోనే..!

ప్రయాణీకుల కాలాన్ని వృథా చేయకుండా.. ప్రయాణం సులువుగా సాగిపోయిందుకు భారత రైల్వే అందుబాటులోకి తెచ్చిన రైలు వందే భారత్. ఇప్పటికే అనే రూట్లలో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యి.. మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు మరో రైలు..

ప్రయాణీకుల కాలాన్ని వృథా చేయకుండా.. ప్రయాణం సులువుగా సాగిపోయిందుకు భారత రైల్వే అందుబాటులోకి తెచ్చిన రైలు వందే భారత్. ఇప్పటికే అనే రూట్లలో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యి.. మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు మరో రైలు..

ఒకప్పుడు రైలు ప్రయాణాలంటే చికాకు పుట్టించేవి. సమయానికి వచ్చేవి కావు, గంటలు గంటలు నిలిచిపోతుంటాయన్న అపవాదు ఉంది. కానీ ఇప్పుడు అందివస్తున్న టెక్నాలజీతో రైలు వ్యవస్థ కూడా అప్ గ్రేడ్ అయ్యింది. సూపర్ ఫాస్ట్, అలాగే మెట్రో, వందే భారత్ రైళ్లు వచ్చేశాయి. ఇవి కొన్ని గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. అయితే వీటిల్లో ఆధునికత, వేగంతో నడుస్తున్నాయి వందే భారత్ రైళ్లు. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మరిన్నింటిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 34 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చకచక పరుగులు తీస్తున్నాయి వందే భారత్ రైళ్లు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ నుండి ఆంధ్రలో విశాఖ, తిరుపతికి రెండు రైళ్లు నడుస్తోంటే.. మరోటి.. కర్ణాటకకు వెళుతుంది. ఈ క్రమంలో మరో వందే భారత్ రైలును భాగ్యనగరి నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు ఈ రైలు ఉండబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో పూణే వరకు ఓ రైలును అందుబాటులోకి తీసుకురావాలన్న యోచనలో ఉంది భారత రైల్వే. సికింద్రాబాద్ నుండి పూణే వరకు ఈ రైలు నడిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రధాని మోడీ ప్రారంభించబోయే 10 రైళ్లలో ఇది కూడా ఒకటి అని సమాచారం.

ప్రధాని మోడీ తర్వలో వర్చువల్ గా ఈ 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆ సమయంలో హైదరాబాద్-పూణే వందేభారత్ కూడా ప్రారంభం అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని  ఇండియన్ రైల్వే లక్ష్యం పెట్టుకున్నప్పటికీ.. సాధ్యపడలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాదికైనా ఈ టార్గెట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో 25 రైళ్లు ప్రారంభం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో 9 వందే భారత్ టైన్లను మోడీ ప్రారంభించడంతో వాటి సంఖ్య 34కు చేరిన సంగతి విదితమే. ఏ మార్గంలో వందే భారత్ రైళ్లు తీసుకువస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments