Mpox Virus: మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

Narendra Modi-Monkeypox Mpox Virus: మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాల..

Narendra Modi-Monkeypox Mpox Virus: మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాల..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో ప్రత్యక్షంగా చూశాం. కోవిడ్‌ 19 మహమ్మారి దెబ్బ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేదు. ఈ ముప్పు నుంచి పూర్తిగా బయటపడకముందే.. మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. మంకీపాక్స్‌ రూపంలో మరో ఉపద్రవం ముంచుకోస్తుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌.. ఇప్పుడు మిగతా దేశాలకు కూడా పాకుతుంది. దాంతో మంకీపాక్స్‌పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇప్పటికే గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని విధించింది. ఇక మన దేశంలో కూడా మంకీపాక్స్‌పై ముందు జాగ్రత్త చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌ కట్టడికి చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

మంకీపాక్స్ వైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంకీపాక్స్‌ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. దీనిలో భాగంగానే రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్‌ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో అవసరమైన మేర ల్యాబ్‌లు ఏర్పాటు చేసి.. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 15,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, 537 మంది మృతి చెందారని మోదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిందని.. కానీ మన దేశంలో మాత్రం ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మోదీ చెప్పుకొచ్చారు. మంకీపాక్స్‌ కేసులను త్వరగా గుర్తించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముందుస్తు వ్యాధి నిర్ధారణ కోసం టెస్టింగ్‌ ల్యాబ్స్‌ని సిద్ధం చేయాలని సూచించారు. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్‌లు రెడీ ఉన్నాయని.. దీన్ని అడ్డుకోవడం కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ పిలుపునిచ్చారు. అంతేకాక మంకీపాక్స్‌ లక్షణాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని.. భారీ ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.

సాధారణంగా ఎంపాక్స్ వైరస్ రెండు నుంచి నాలుగు వారాల ఉంటుందని, రోగులు సాధారణ వైద్య సంరక్షణ, చికిత్సతో కోలుకుంటారని సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరించారు. వ్యాధిగ్రస్తులతో సుదీర్ఘమైన, సన్నిహిత సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిచెందుతుందని ఆయన చెప్పారు. కాగా, ఎంపాక్స్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఆగస్టు 12న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎంపాక్స్‌ను అంటువ్యాధిగా పేర్కొంటూ అలర్ట్ అప్‌డేట్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని ఆరోగ్య, వైద్య బృందాలతో తనిఖీలు చేపట్టింది. 2022లో భారత్‌లో 22 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదని కేంద్రం తెలిపింది.

Show comments