Arjun Suravaram
Dailyhunt ‘Trust of Nation’ survey: దేశ వ్యాప్తంగా లో లోక్ సభ ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ క్రమంలో కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డైలీహంట్ సంస్థ సంచలన సర్వేను వెల్లడించింది.
Dailyhunt ‘Trust of Nation’ survey: దేశ వ్యాప్తంగా లో లోక్ సభ ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ క్రమంలో కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డైలీహంట్ సంస్థ సంచలన సర్వేను వెల్లడించింది.
Arjun Suravaram
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి వ్యూహా, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో మరోవైపు సర్వేల హడావుడి కూడా నడుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక సర్వేలు వెలువడ్డాయి. తాజాగా కంటెంట్ డిస్కవరీ ఫ్లాట్ ఫామ్ డైలీ హంట్ ఓ సర్వేను వెల్లడించింది. ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ -2024 పేరుతో సర్వే ఫలితాలను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలు సర్వేలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పటికే అంచనా వేశాయి. తాజాగా ప్రముఖ కంటెంట్ డిస్కవరీ ప్లాట్ ఫామ్ డైలీ హంట్ ఓ సర్వేను వెల్లడించింది. ఆంగ్లం, హిందీ, కీలక ప్రాంతీయ భాషలతో సహా 11 భాషలలో డైలీ హంట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించబడింది. విభిన్న జనాభాలో 77 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది. అలా 2024 సాధారణ ఎన్నికలకు ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో అంచనా వేసింది..
ఇక ఈ సర్వే ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత పరిపాలనపై 61 శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఈ సర్వే జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ/ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉండాలని కోరుకున్నారు. అలానే 21.8 శాతం మంది రాహుల్ గాంధీకి ప్రధాని కావాలని కోరుకున్నారు.
అలానే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీకి 60.1శాతం మంది అనుకూలంగా ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ 26.5శాతం వచ్చాయి. అలానే ఏపీలో 71.8 శాతం మంది ప్రధాని మోదీకి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ 17.9 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇక మోదీ పాలనపై 61 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా, 21 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలానే ఎన్డీఏ ఆర్థిక నిర్వహణపై 53.3 శాతం మంది చాలా బాగుందని అభిప్రాయ పడ్డారు. 20.9శాతం మంది అది ‘మెరుగైనది’ అని అభిప్రాయపడ్డారు. అలానే 52.6 శాతం మంది ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అలానే 28.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంగ్లీషు, హిందీ తో పాటు ఇతర కీలక ప్రాంతీయ భాషలతో సహా 11 భాషల్లో అందుబాటులో ఉన్న ప్రశ్నపత్రంతో డెలీ హాంట్ ఈ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. 77 లక్షల మంది ఈ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో వేరు వేరు వయస్సుల వారు, వృతుల వారు పాల్గొన్ని తమ అభిప్రాయలను తెలిపారు. ఆర్థిక నిర్వహణ, విదేశాంగ విధానం, సంక్షోభ నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాలు మరియు పాలనలోని ఇతర అంశాలపై అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజల అవగాహనను అంచనా వేయడానికి సర్వే ప్రశ్నలు రూపొందించబడ్డాయి.