iDreamPost
android-app
ios-app

కారు డ్రైవర్‌తో కలిసి ఎంత పని చేసింది.. ఇలాంటి ఆడదాన్ని అస్సలు క్షమించకూడదు..

Along With The Car Driver: ఇటీవల కాలంలో కొంతమంది ఆడవాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. భర్తకు తెలియకుండా చాలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఇంకొంతమంది అయితే డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ మహిళ కారు డ్రైవర్ తో కలిసి క్షమించరాని పాపం చేసింది.

Along With The Car Driver: ఇటీవల కాలంలో కొంతమంది ఆడవాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. భర్తకు తెలియకుండా చాలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఇంకొంతమంది అయితే డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ మహిళ కారు డ్రైవర్ తో కలిసి క్షమించరాని పాపం చేసింది.

కారు డ్రైవర్‌తో కలిసి ఎంత పని చేసింది.. ఇలాంటి ఆడదాన్ని అస్సలు క్షమించకూడదు..

కొంతమంది ఆడవాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మగవాళ్ళని మించిపోయేలా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో గానీ, హత్యల విషయంలో గానీ, కుళ్ళు, కుతంత్రాల విషయంలో గానీ మగాళ్ళకి పోటీ ఇస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుంటాం అనేలా పాపపు పనుల్లో కూడా ముందుంటున్నారు. తాజాగా ఓ ఇల్లాలు కారు డ్రైవర్ తో కలిసి క్షమించరాని పాపం చేసింది. సీరియల్స్ ప్రభావం ఎక్కువైందో ఏమో గానీ అక్కడ ఉన్న లేడీ విలన్ లక్షణాలన్నీ ఈమెలో ఉన్నాయి. ఈమె చేసిన పాపం తెలిస్తే ఇలాంటి ఆడదాన్ని క్షమించకూడదని అంటారు.  

కోడలు అంటే కూతురుతో సమానం అంటారు. ఒక ఇంటి కోడలు అయ్యిందంటే ఆ ఇంట్లో అత్తామామలను అమ్మానాన్నలుగా భావించాలి. కానీ ఈ ఇల్లాలు తండ్రిలాంటి మామగారిని కాటికి పంపాలని చూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ సిటీలో బాలాజీ నగర్ లో మే 22న 82 ఏళ్ల పురుషోత్తం అనే వృద్ధుడు కారు ప్రమాదంలో చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వృద్ధుడిని గుద్దిన కారుని, కారు డ్రైవర్ ని గుర్తించారు. ఆ తర్వాత డ్రైవర్ ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇది యాక్సిడెంట్ అనే అనుకున్నారు పోలీసులు. డ్రైవర్ కి కూడా వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. అయితే పై అధికారులకు అనుమానం రావడం మళ్ళీ రీఓపెన్ చేశారు. మళ్ళీ కేసుని విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని తేలింది. 

కోడలే మామగారిని హత్య చేయించిందని విచారణలో తేలింది. ఆ వృద్ధుడికి 300 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆ ఆస్తికి అడ్డుగా ఉన్నాడని మామని చంపేయాలని స్కెచ్ వేసింది కోడలు అర్చన. డ్రైవర్ తో పాటు మరో వ్యక్తితో కలిసి మామను లేపేయడానికి ప్లాన్ వేసింది. తాను చెప్పినట్టు చేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పింది. డ్రైవర్ బగ్దే, మరో వ్యక్తి ధార్మిక్ లిద్దరూ సరే అనడంతో అర్చన మామ హత్యకు పథకం రచించింది. ముందు వారిద్దరి చేత ఒక పాత కారు కొనిపించింది. హిట్ అండ్ రన్ లో తన భర్త తండ్రిని చంపాలని చెప్పింది. ఇలా అయితే ఇది యాక్సిడెంట్ లో పోతుందని.. తన మీదకు రాదని ప్లాన్ వేసింది. వీధుల్లో పురుషోత్తం నడుస్తున్నప్పుడు వెనక నుంచి గుద్దేసి పారిపోవాలని చెప్పింది.

వాళ్ళు అర్చన చెప్పినట్లే గుద్దేసి పారిపోయారు. ఈ మొత్తం హత్యని యాక్సిడెంట్ లా చిత్రీకరించారు. కానీ పోలీసు మామలు చూస్తూ ఊరుకోరుగా. కోడలి పథకాన్ని బట్టబయలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయడంతో కోడలు కుట్ర బయటపడింది. విచారణలో డ్రైవర్ ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు డ్రైవర్ తో పాటు హత్యలో భాగస్వామిగా ఉన్న ధార్మిక్ ని.. అలానే కోడలిని అరెస్ట్ చేశారు. 300 కోట్ల కోసం మామను చంపింది. ఇప్పుడు జైల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి.            

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి