Arjun Suravaram
Ayodhya Ram Mandir: ఆదిపురుషుడు, కౌసల్యా తనయుడు అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యద్బుతంగా జరిగింది. ఈ రామమందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట కొత్త ఏడాదిలో జనవరి 22వ తేదీన ఘనంగా జరగబోతోంది.
Ayodhya Ram Mandir: ఆదిపురుషుడు, కౌసల్యా తనయుడు అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యద్బుతంగా జరిగింది. ఈ రామమందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట కొత్త ఏడాదిలో జనవరి 22వ తేదీన ఘనంగా జరగబోతోంది.
Arjun Suravaram
దేశంలోని కోట్లాది మంది కల, ఎన్నో ఏళ్ల తరబడి కళ్లుకాయలు కాసేలా ఎదురు చూసిన ఆ కల మరికొద్ది రోజుల్లో నేరవేరబోతుంది. అదే అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం. జనవరి 22న శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నగరంలో ఈ అద్భుత కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 దశబ్ధాలుగా హిందువులు ఎదురు చూస్తున్న కల నిరవేరబోతుంది.ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్య నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 14న జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అయినా అక్బర్ తాజ్‌ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన వ్యక్తి అక్బర్ కుటుంబంతో కలిసి నివాసం ఉండేవారు. ఆయనకు కళ్లు కనపడవు. అయినప్పటికే ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అక్బర్ తాజ్ పూర్వీకులు శ్రీరాముడిని కొలిచేవారంట. అందుకే దివ్యాంగుడైన అక్బర్ తాజ్ రాముల్లోరి గుణగుణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. ఇక శ్రీరాముడు కొందరి, ఓ మతానికి చెందిన వాడు అనే వారికి… అక్బర్ సూపర్ ఆన్సర్ ఇచ్చారు. శ్రీరాముడు అందరికీ చెందిన వాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. ఇక అక్బర్ తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. తాను దృష్టి లోపంతో బాధ పడుతున్నానని తెలిపారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 44 ఏళ్లు. ఇప్పటికే వివిధ రచనలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దృష్టిలోపం కారణం అందరి పిల్లల మాదిరిగా చదువుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అలా దృష్టి సమస్యతో బాధపడుతున్న కూడా అక్బర్ బ్రెయిలీ లిపిని నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. అక్బర్ తాజ్ దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. అలానే శ్రీరామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14న జరిగే శ్రీరాముని భక్తిగీతాల ప్రత్యేక కార్యక్రమానికి అక్బర్ రాజ్ ను ఆహ్వానించారు.
ఆయనకు దక్కిన ఈ మంచి అవకాశంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించే అవకాశం దొరకడం అదృష్టమని అంటున్నారు. అంతేకాక అక్బర్ తాజ్ జన్మదన్యం అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరి. అయోధ్యలో శ్రీరామ మందిర కార్యక్రమంలో ముస్లింలు కూడా పాలు పంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు అక్బర్ తాజ్. ఇలాంటి గొప్ప దివ్యాంగ కవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.