nagidream
బ్రేకప్ ని అమ్మాయిలు ఎంతగా తీసుకుంటారో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మాత్రం ఈ విషయంలో చాలా సున్నితంగా ఉంటున్నారు. మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మాజీ ప్రియురాలిది తప్పు లేదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
బ్రేకప్ ని అమ్మాయిలు ఎంతగా తీసుకుంటారో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మాత్రం ఈ విషయంలో చాలా సున్నితంగా ఉంటున్నారు. మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మాజీ ప్రియురాలిది తప్పు లేదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
nagidream
ఇటీవల కాలంలో అమ్మాయిలు ప్రేమను చాలా లైట్ గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఒకానొక సమయంలో అబ్బాయిలు ప్రేమ పేరుతో మోసం చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలే ప్రేమ పేరుతో మగాళ్ల జీవితంతో ఆడుకుంటున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ మధ్య కాలంలో లవ్ బ్రేకప్ కి సంబంధించిన వార్తలు కూడా ఎక్కువయ్యాయి. అయితే.. ‘అమ్మాయిని లవ్ చేసాం, పీకల్లోతు ప్రేమలో మునిగాం.. ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది.. బయటకు వచ్చేసాం’ అన్నట్టు ఉండలేకపోతున్నారు నేటి తరం అబ్బాయిలు. చాలా తక్కువ మంది మాత్రమే బ్రేకప్ ని లైట్ తీసుకుంటున్నారు. కానీ చాలా మంది ప్రేయసితో బ్రేకప్ అంటే భరించలేకపోతున్నారు. అప్పటి వరకూ తనతో కలిసి తిరిగిన అమ్మాయి, తన బాధలు, సంతోషాలు పంచుకున్న అమ్మాయి వేరొకడితో ఉంటుందని తెలిస్తే ఏ మగాడి గుండైనా ఆగిపోతుంది. ఈ క్రమంలో మహా సున్నితంగా ఉండే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అమ్మాయిలది తప్పు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన మనీషా చూడాసమ, నితిన్ కేనీలు కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మనీషా రాజేష్ పన్వర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. నితిన్ కేనీ మాత్రం మనీషాను మర్చిపోలేక ఆమె వెంట పడేవాడు. ఆమె వెంట పడద్దని చెప్పేది. దీంతో మానసిక క్షోభకు గురైన నితిన్ 2016లో జనవరి 15న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన కుమారుడి ఆత్మహత్యకు మనీషా, ఆమె ప్రియుడు రాజేష్ అని తల్లిదండ్రులు కేసు పెట్టారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. మనీషా, రాజేష్ ల మీద ఐపీసీ 306 చట్టంలోని 107 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వారిని నిందితులుగా చేర్చారు.
ఈ కేసు విచారణ పూర్తి చేసిన ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్పీ మెహతా మనీషా, రాజేష్ లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడితే అందుకు అతని మాజీ ప్రియురాలు కారణం కాదని ముంబై కోర్టు తీర్పు వెల్లడించింది. మానసిక క్షోభకు గురైన యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని చట్ట ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు భావించలేమని.. మృతుడి ప్రియురాలికి శిక్ష విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. లవ్ రిజెక్ట్ చేయడం వల్ల మానసిక క్షోభకు గురవ్వడం, తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వంటి సంఘటనల అంశమై చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని కోర్టు తెలిపింది. చట్టంలో తగిన నిబంధనలు లేని కారణంగా ఆత్మహత్యకు ప్రేరేపించారని మాజీ ప్రియురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని న్యాయమూర్తి ఎన్పీ మెహతా పేర్కొన్నారు.
ప్రియురాలు ఎలాంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్తే ప్రేమించిన వ్యక్తి మానసిక క్షోభకు గురవుతాడు. లవ్ ఫెయిలై మానసిక గాయం వల్ల ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటే ఈ కేసుని ఐపీసీ 306 చట్టంలోని 107 సెక్షన్ కిందకు రాదని.. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భావించలేమని న్యాయమూర్తి వెల్లడించారు. ఇష్టం వచ్చినట్టు లవర్ ని మార్చడం నైతికంగా తప్పే కానీ ఆత్మహత్యకు ప్రేమికురాలే కారణం అని చెప్పి ఆమె మీద కేసు పెట్టే అవకాశం లేదు. పార్టనర్ ని మార్చుకున్నంత మాత్రాన ఆత్మహత్య ఘటనలో ఆమెను బాధ్యురాలిని చేయలేమంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి ఒక అమ్మాయికి వస్తే మాత్రం ఆ అబ్బాయి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులూ పెట్టి లోపలేస్తారని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.