Venkateswarlu
Venkateswarlu
కొన్ని సందర్భాల్లో ప్రేమలు, ఆప్యాయతల విషయంలో మనుషుల కంటే మూగ జీవాలే నయం అనిపిస్తుంది. అవి ఓ సారి ప్రేమించటం మొదలుపెడితే.. చచ్చే వరకు ఆ ప్రేమను కొనసాగిస్తాయి. ముఖ్యంగా యజమానుల విషయంలో మూగ జీవాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకున్న తాజా సంఘటన. ఓ కోతి చనిపోయిన తన యజమాని అంత్యక్రియల్లో పాల్గొనటానికి ఏకంగా 40 కిలో మీటర్లు ప్రయాణం చేసి వెళ్లింది. అక్కడ కన్నీళ్లు పెట్టించే విధంగా ప్రవర్తించింది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లోని దిదోలీ జోయాకు చెందిన రామ్‌కున్వర్ సింగ్ ఓ కోతిని పెంచుకుంటున్నాడు. రెండు నెలల క్రితం కోతికి బ్రెడ్డు తినిపించటం ద్వారా వారిద్దరి మధ్యా బంధం మొదలైంది. ఇక అప్పటినుంచి రామ్‌కున్వర్ ప్రతీ రోజూ ఆ కోతికి ఆహారం ఇచ్చేవాడు. ఆ కోతి ప్రతీ రోజూ రామ్ కున్వర్ దగ్గరకు వచ్చి ఆడుకునేది. అక్టోబర్ 10 తేదీ కూడా ఆడుకోవటానికి రామకున్వర్ ఇంటి దగ్గరకు వచ్చింది. అయితే, రామ్‌కుమార్ చనిపోయి ఉన్నాడు. దీంతో దాని గుండె పగిలింది.
కోతి రామ్‌కున్వర్‌పై పడి లేపటానికి ప్రయత్నించింది. ఎంత లేపినా ఆయన లేవలేదు. దీంతో అది ఆయన మృతదేహం పక్కన బోర్లాపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. పెద్దాయన మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వాహనంలో తీసుకెళుతూ ఉండగా.. అది ఆ వాహనంపైకి ఎక్కింది. రామ్‌కున్వర్ మృతదేహంతో పాటు 40 కిలోమీటర్లు ప్రయాణించింది. తనకు తిండిపెట్టిన అతడి అంత్యక్రియల్లో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఆ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
इससे बड़ी निःस्वार्थ प्रेम की मिसाल क्या हो सकती है. एक व्यक्ति रोज़ इस बन्दर को खाना खिलाता था. उस व्यक्ति की मृत्यु पर ये बन्दर बिलख-बिलख कर रोया. घर से घाट तक के सारे संस्कारों में शामिल रहा. ये वीडियो अमरोहा के थाना डिडौली जोया कस्बे का बताया जा रहा है. #viralvideo pic.twitter.com/M13afMIpWf
— Rana Yashwant (@RanaYashwant1) October 12, 2023