iDreamPost
android-app
ios-app

సొంత ఇల్లు కట్టుకునే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! రూ.55 వేల కోట్ల..

Budget 2024: ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సొంత ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

Budget 2024: ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సొంత ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

సొంత ఇల్లు కట్టుకునే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! రూ.55 వేల కోట్ల..

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఏదో ఒక స్కీమ్ ను ప్రభుత్వం అందిస్తోంది. మహిళలకు, రైతులకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు ప్రత్యేకమైన స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసింది. అలానే పేదవాళ్లు, సొంతిళ్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా కేంద్రం రాయితీ రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కూడా మరోసారి వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరి..ఆ శుభవార్త ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. గతంలో కంటే ఎన్డీయేకి సీట్లు బాగానే తగ్గిన ప్రభుత్వం ఏర్పాటు చేసే మోజార్టీ మాత్రం వచ్చింది. ఈ క్రమంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలను మళ్లీ తమ వైపుకు తిప్పుకోవడానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకునే వారికి గ్రామీణ గృహ నిర్మాణం అనే స్కీమ్ కింద భారీగా రాయితీ అందించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఈ నేపథ్యంలోనే జూలై 23వ తేదీన ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్లో  గ్రామీణ గృహ నిర్మాణ పథంకు రాయితీని పెంచనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ స్కీంకు ఇస్తున్న సబ్సిడీ కేటాయింపుకు 50 శాతం మేర పెంచనుందని సమాచారం. అయితే ఈసారి గ్రామీణ గృహ స్కీమ్ కి  ఏకంగా 55 వేల కోట్ల కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో  కూడా రూరల్ హౌసింగ్ స్కీమ్ కు మోదీ ప్రభుత్వం రూ.32 వేల కోట్ల రాయితీని అందించింది. ఇప్పుడు సంఖ్యను రూ.55 వేల కోట్లకు పెంచబోతుంది. గ్రామాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడే లక్షల మందికి ఉపాధి కల్పనతో పాటు…రూరల్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలన ప్రభుత్వం చూస్తోందని సమచారం. అలానే  సొంత ఇంటి నిర్మాణం కోసం ఉండే వారికి కూడా ఆర్థిక సహయం చేసేందుకు.. భారీగానే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించునున్నట్లు సమాచారం. 2016లో రూరల్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభమైంది. 55 వేల కోట్ల రూపాయ నిధఎలు కేటాయిస్తే.. ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి నుంచి భారీ మొత్తంలో కేటాయింపులు పెంచడం ఇదే మొదటి సారి అవుతుంది. పీఎం ఆవాస్ యోజన హౌసింగ్ పథకం కింద గడిచిన ఎనిమిదేళ్లలో 2.6 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్రం ఇటీవలే మరో 3 కోట్లు ఇల్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి వచ్చే బడ్జెట్లో మరింత ఆర్థిక సాయం అందించాలని  కేంద్రం  చూస్తోంది. మొత్తంగా గృహ నిర్మాణ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేస్తే.. అది ఇళ్లు కట్టుకునే వారికి నిజంగానే గుడ్ న్యూస్ అని పలువురు మేధావులు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి