MBBS Fee Only 3K: ఈ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు కేవలం 3 వేలు మాత్రమే! ఎక్కడో తెలుసా?

ఈ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు కేవలం 3 వేలు మాత్రమే! ఎక్కడో తెలుసా?

MBBS Fee Only 3K: ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే లేనివాళ్లు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అయితే మీకు తెలుసా ఎంబీబీఎస్ ఫీజు 3 వేలు మాత్రమే తీసుకునే ప్రైవేట్ కాలేజీ ఒకటి మన దేశంలో ఉందని.

MBBS Fee Only 3K: ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే లేనివాళ్లు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అయితే మీకు తెలుసా ఎంబీబీఎస్ ఫీజు 3 వేలు మాత్రమే తీసుకునే ప్రైవేట్ కాలేజీ ఒకటి మన దేశంలో ఉందని.

ఎంబీబీఎస్ చేయాలంటే ఆషామాషీ కాదు. అడ్మిషన్ కే లక్షలు అవుతాయి. ఇక ఏటా ఫీజులు, బుక్స్, ట్యూషన్ ఫీజులు ఇలా సామాన్యులు తట్టుకోలేనంతగా ఖర్చు ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు తెచ్చుకోవడం చాలా కష్టం. నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడం, టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం అందరివల్లా కాదు. దీంతో డబ్బున్న వాళ్ళు లక్షలు పోసి టాప్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కుంటారు. కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికే మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించడం కష్టం. అలాంటి వారి కోసమే అన్నట్టు ఓ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి 120 ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఫీజు కూడా వేలల్లోనే ఉంటుంది. ఎంబీబీఎస్ ఫీజు కేవలం 3 వేలు మాత్రమే.

అవును మీరు విన్నది నిజమే. అడ్మిషన్ సమయంలో ఒకసారి మాత్రమే కట్టే కాలేజీ ఫీజు 8,800 రూపాయలు ఉంటుంది. ఇతర యాన్యువల్ ఫీజు 15,105 రూపాయలు ఉంటుంది. యూనివర్సిటీకి ఒకసారి కట్టే పేమెంట్ 13,425 రూపాయలు ఉంటుంది. మొత్తం తొలి ఏడాది ఖర్చు 40 వేలు అవుతుంది. ఇక హాస్టల్ కి అమ్మాయిలకి 4 వేలు, అబ్బాయిలకి 10 వేలు. నెల బిల్లులకు అబ్బాయిలకి 6 వేలు, అమ్మాయిలకు 4 వేలు ఖర్చు ఉంటుంది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా కోర్సులకి కూడా ఫీజులు తక్కువగానే ఉన్నాయి. ఇంతకీ ఈ కాలేజ్ ఎక్కడుందో తెలుసా? తమిళనాడులోని వేలూరులో ఉంది. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఇది. దీన్ని 1900వ సంవత్సరంలో డాక్టర్ ఇడా సోఫియా స్కడర్ స్థాపించారు. ఈ కాలేజీ ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా పని చేసే స్వచ్చంద సంస్థ. భారతదేశంలో ఉన్న క్రైస్తవ చర్చి లీడర్స్ తో రూపొందిన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ద్వారా ఈ కాలేజీ మరియు హాస్పిటల్ నిర్వహించబడుతుంది. ఈ కాలేజీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఎయిమ్స్ కాలేజీ ఉండగా.. రెండో స్థానంలో చంఢీ గఢ్ కి చెందిన పీజీఐఎంఈఆర్ కాలేజీ ఉంది. ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఈటాఏటా 2,600 మందికి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఈ కాలేజీలో మెడికల్, నర్సింగ్, మెడికల్ అనుబంధ రంగాల్లో 175 కంటే ఎక్కువ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్డీ కూడా చేయవచ్చు. ప్రతి ఏటా అన్ని కోర్సుల్లో 2,600 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందుతుండగా.. వంద మంది ఎంబీబీఎస్ లో చేరుతున్నారు. ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీగా గుర్తింపు పొందింది. 

Show comments