Arjun Suravaram
Bombay Blood Group: అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన ఓ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమెను ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి ఏకంగా 400కుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి రక్తదానం చేశాడు.
Bombay Blood Group: అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన ఓ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమెను ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి ఏకంగా 400కుపైగా కిలోమీటర్లు ప్రయాణం చేసి రక్తదానం చేశాడు.
Arjun Suravaram
మానవ రక్తం అనేది కొన్ని గ్రూపులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ, బీ, ఏబీసీ, ఓ, వంటి పలు గ్రూపులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అరుదైన బ్లడ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. బాంబే బ్లడ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ గ్రూప్ వాళ్లు, అదే గ్రూప్ వాళ్ల నుంచి మాత్రమే రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ అరుదైన గ్రూప్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి..చావు బతుకుల్లో ఉన్న మహిళ కోసం 400 కిలోమీటర్లు జర్నీ చేసి.. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ను దానం చేశాడు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
గోపిచంద్ హీరోగా నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో విలన్ గుండె సమస్యతో బాధ పడుతుంటాడు. అతనిది అరుదైన బ్లడ్ గ్రూప్. దీంతో అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి గుండె మాత్రమే సరిపోతుంది. దీంతో హీరోది కూడా సేమ్ గ్రూప్ కావడంతో అతడిని కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. తాజాగా అదే అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన ఓ మహిళ.. అనారోగ్య సమస్యతో చావు బతుకల మధ్య పోరాడుతుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి తెలుసుకున్నఅదే గ్రూప్ కలిగిన వ్యక్తి.. 400 కి.మీ జర్నీ చేసి.. రక్తదానం చేశాడు.
మహారాష్ట్రలోని షిర్డీ ప్రాంతంలో రవీంద్ర అష్తేకర్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటాడు. ఆయన పూల వ్యాపారం చేస్తూ కుటుంబాన్న పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ (30) అనారోగ్య సమస్యతో ప్రాణాలతో పోరాడుతున్నది. ప్రస్తుతం ఆమె ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాంబే బ్లడ్‌గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఇందులో ‘హెచ్’ యాంటీజెన్‌కు బదులుగా యాంటీ-హెచ్ యాంటీబాడీస్ ఉంటాయి. వీరికి ఆ గ్రూపు కలిగిన వారే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.
అలాంటి అరుదైన గ్రూప్ కలిగిన ఆ మహిళ..ఎంతో అదే గ్రూప్ రక్తం ఇచ్చే వారి కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు అర్జెంటుగా బాంబే బ్లడ్‌గ్రూప్ కావాలన్న కుటుంబ సభ్యులు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆ సమాచారం రవీంద్రకి చేరింది. దీంతో ఆమెను కాపాడేందుకు రవీందర్ వెంటనే స్నేహితుడి కారులో బయలుదేరాడు. మహారాష్ట్ర నుంచి బయలు దేరి 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న రక్తదానం చేశాడు. అలా మానవత్వంతో అంతదూరం ప్రయాణించిన రవీంద్ర..రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడగలిగాడు. అత్యంత అరుదైన బ్లడ్‌గ్రూప్ కలిగిన రవీంద్ర రాష్ర్టాలతో సంబంధం లేకుండా ఎక్కడ ఎవరికి అవసరం పడినా వెంటనే వెళ్లి రక్తదానం చేస్తుంటారు. గతంలోనూ ఇలా మహారాష్ట్రతో పాటు గుజరాత్, యూపీ, ఎంపీ గత పదేళ్ల నుంచి 8 సార్లు రక్తదానం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన మంచిపనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.