ప్రస్తుత సమాజంలో కుటుంబంలో ఒకరిపై ఉన్న పగను.. ఆ ఫ్యామిలీలో ఇతర సభ్యులపై తీర్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తూ వస్తున్నాం. తాజాగా అలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రితో ఉన్న వ్యక్తగత కక్షల కారణంగా.. అభం శుభం తెలియని పసి పిల్లలను కారుతో ఢీకొట్టాడు ఓ దుర్మార్గుడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తండ్రిపై పగను అతడి బిడ్డలపై తీర్చుకోవాలనుకున్న దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘోరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. ఈ దారుణమైన సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని మలిహాబాద్ ప్రాంతం, సింధర్వ గ్రామంలోని ఖాజీ ఖేడాలో సీతారం అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఓ అబ్బాయి ఉన్నాడు. కాగా.. సీతారం కు అదే ప్రాంతంలో నివసించే బంధువు గోవింద్ యాదవ్ తో గొడవలు ఉన్నాయి. దాంతో ఇద్దరి మధ్య కక్ష పెరిగింది. ఈ క్రమంలోనే జూలై 13వ తేదీ సీతారం ముగ్గురు పిల్లలు దగ్గరలోని మార్కెట్ కు వెళ్లి వస్తున్నారు. ఆ ముగ్గురు పిల్లలు రోడ్డుపై నడిచి వెళ్తున్న క్రమంలో గోవింద్ ఎదురుగా కారులో వస్తున్నాడు.
ఈ క్రమంలోనే రోడ్డుపై వస్తున్న ఆ పిల్లలను చూసిన గోవింద్ కు వారి తండ్రితో ఉన్న పగ గుర్తుకు వచ్చింది. అంతే వేగంగా కారుతో వచ్చి ఆ పిల్లలను ఢీకొట్టాడు. దాంతో ఆ పసి పిల్లలు కింద పడ్డారు. అయినా కొంచెం కూడా జాలిలేని అతడు.. వారిపైకి కారు టైర్లను ఎక్కించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ లోపే అక్కడున్న ప్రజలు కారును చుట్టు ముట్టారు. కారును కదలకుండా చేశారు. గోవింద్ ను ఎందుకు ఇలా చేశావంటూ ప్రశ్నించగా.. అతడు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు అతడిని పట్టుకున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సీతారం కూడా అక్కడికి వచ్చాడు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో లక్నో పోలీసులు గోవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.
लखनऊ के मलिहाबाद में आपसी रंजिश के तहत तीन मासूमों को कुचलकर मारने की कोशिश। मामला 13 जुलाई का बताया जा रहा। सीसीटीवी फुटेज सामने के बाद पुलिस ने आरोपी गोविंद यादव को गिरफ्तार किया। pic.twitter.com/WJUW6rDzbn
— Bhadohi Wallah (@Mithileshdhar) July 18, 2023
ఇదికూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత!