P Venkatesh
భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి విషయం కక్కారు. చైనా సపోర్ట్ తో భారత సైనికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి విషయం కక్కారు. చైనా సపోర్ట్ తో భారత సైనికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
P Venkatesh
భారత్ మాల్దీవుల మధ్య తలెత్తిన దౌత్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను సందర్శించి భారతీయులు తమ పర్యాటక ప్రదేశాల లిస్టులో లక్షద్వీప్ ను చేర్చుకోవాలని సూచించారు. అయితే మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకంపై ఈ ప్రభావం చూపించింది. మోడీ మాటకు కట్టుబడి భారతీయులు మాల్దీవుల పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. పర్యాటక రంగంలో చేటుచోసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా అండ చూసుకుని భారత్ కు హెచ్చరికలు చేస్తున్నాడు.
భారత్ కు చెందిన సైనికులు ఈ ఏడాది మే 10 తర్వాత తమ దేశంలో ఉండకూడదని ముయిజ్జు తెలిపారు. డ్రాగన్ మద్దతుతో మాల్దీవుల అధ్యక్షుడు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. భారత సైనికులు సివిల్ డ్రెస్సుల్లో కూడా తిరగొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మే 10 తర్వాత భారత సైనికులను మాల్దీవుల్లో ఎవరిని ఉండనివ్వం అని ముయిజ్జు వెల్లడించారు. మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవుల విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు ఒప్పందం చేసుకున్న కాసేపటికే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి తెరలేపింది.