Krishna Kowshik
సోషల్ మీడియా వచ్చాక చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. యూజర్లను, యూటూబర్లను, ఇన్ల్ఫుయెన్సర్లను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ ద్వేషపూరిత కామెంట్ల వల్ల చాలా మంది చాలా మంది ఆత్మనూన్యతకు గురౌతుంటారు..
సోషల్ మీడియా వచ్చాక చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. యూజర్లను, యూటూబర్లను, ఇన్ల్ఫుయెన్సర్లను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ ద్వేషపూరిత కామెంట్ల వల్ల చాలా మంది చాలా మంది ఆత్మనూన్యతకు గురౌతుంటారు..
Krishna Kowshik
నేడు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ విస్తృతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. యూజర్లు ఫోనులో తల పెట్టేసి మరీ అందులో ఈదేస్తున్నారు. పక్కన ఏం జరుగుతుందో తెలియదు. అంతా ఆ మాయా ప్రపంచంలోనే బతికేస్తున్నారు. చాలా మంది ఇన్ల్ఫుయెన్సర్లుగా మారి డబ్బులు గడిస్తున్నారు. గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరి వీడియోలను చూసిన కొంత మంది షేర్లు, లైక్స్ చేయడమే కాదూ..తమ అభిప్రాయాలను చెప్పేందుకు కామెంట్ బాక్సులో బరా బరా రాసేస్తుంటారు. అయితే కొంత మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ, ఆ ఇన్ల్ఫుయెన్సర్‌ను ఇబ్బందికి గురి చేస్తుంటారు. దీని వల్ల బాధపడి.. కొంత మంది కామెంట్ బాక్స్ హైడ్ చేస్తూ ఉంటారు.
బ్యాడ్‌గా రాస్తూ, నెగిటివ్, అసభ్యకరమైన కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. దీని వల్ల కొంత మంది మానసిక ఒత్తిడికి గురౌతుంటారు. మరికొంత మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి కూతల కారణంగా మేకప్ ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన 16 ఏళ్ల ట్రాన్స్ జెండర్ ప్రన్షు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు.. సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్ స్టాలో తన ఖాతా ద్వారా రకరకాల మేకప్ వీడియోలు పోస్టు చేస్తూ ఉంటారు. దీపావళిని పురస్కరించుకుని ఇతడు కూడా చీర కట్టుకుని రీల్ చేశాడు. ఈ రీల్ పై ఏకంగా 4 వేల మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి పోయాడు. దీంతో ఈ నెల 21న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయాన్ని మరో ట్రాన్స్ జెండర్.. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. కాగా, ఆ వీడియోపై సింగర్ చిన్మయి, నటుడు హర్ష, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత వంటి వారు స్పందించారు. అతడో పిల్లవాడు అంటూ ఇలా ద్వేషపూరిత కామెంట్ల పెట్టడం సరైన చర్య కాదని రాస్తున్నారు. ఇతడు మరణించారన్న విషయం తెలియని కొంత మంది ఇంకా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. నెగిటివ్ కామెంట్ల రాయడం వల్ల అభం, శుభం తెలియని ఓ చిన్నవాడిని, భవితవ్యంపై ఎన్నో ఆశలతో బతుకుతున్న ఓ వ్యక్తిని ప్రాణం పోయింది.