వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలను తగ్గించిన ప్రభుత్వం

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలను తగ్గించిన ప్రభుత్వం

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో వాహనదారులకు చాలా సతమతమవుతున్నారు. దీంతో వాహనాలను నడపాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాహనదారులకు తాజాగా ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ శుభవార్తతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది.

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో వాహనదారులకు చాలా సతమతమవుతున్నారు. దీంతో వాహనాలను నడపాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాహనదారులకు తాజాగా ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ శుభవార్తతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది.

గత కొన్నిరోజులుగా సామాన్య ప్రజలకు అడుగడుగున భారీ షాక్ లు తగులుతున్నాయి. ఎందుకంటే.. నిత్యావసరా వస్తువులు దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు ప్రతి విషయంలో ధరలు మండిపడుతున్నాయి. ఇక ఈ భారీ ధరల కారణంగా ప్రజలు సతమతమవుతున్నారు ఇలాంటి సమయంలోనే మరో వైపు చమురు ధరలు కూడా పెరిగిపోవడంతో.. సామాన్యులకు మరింత భారంగా మారింది. ముఖ్యంగా వాహనదారులకు ఈ పెట్రోల్, డీజల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే కచ్చితంగా ఆ వాహనానికి పెట్రోల్, డిజీల్ అనేది చాలా ప్రధానమైనది. మరి అటువంటి చమురు ధరలు ఈ మధ్య ఆకాశాన్ని తాకుతుంటే అసలు వాహానాలు నడిపేది ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలా ప్రతిసారి లీటరు ధరలు పెంచుకుంటూ వాహనదారులకు బిగ్ షాక్ ఇస్తున్నా ప్రభుత్వం.. తాజాగా వాహనదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ శుభవార్తతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో వాహనదారులకు చాలా సతమతమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ చమురు ధరలు తగ్గిస్తామని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు మోడి ప్రభుత్వం ఏర్పాడటంతో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా  పెట్రోల్‌,డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు ఓ గుడ్ న్యూస్ అందించింది.  రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి వాహనదారులకు కాస్త ఊరటను అందించింది.  అంతేకాకుండా.. ముంబాయిలోని పెట్రోల్ డీజిల్ పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

ఇక మహా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గనుంది. అలాగే పెట్రోల్ పై పన్ను 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక దీని వల్ల ముంబై, నవీ ముంబై, థానే సహా ముంబై ప్రాంతంలో పెట్రోల్ ధరలు 65 పైసలు తగ్గనున్నాయి. అయితే ప్రస్తుతం ఈరోజు అనగా  జూన్ 28న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.92.15గా ఉంది ఉన్నాయి. కానీ ఇక నుంచి పెట్రోల్ పై రూ. 65 పైసలు, అలాగే డీజిల్ పై రూ.2 తగ్గనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి, ముంబాయిలో పెట్రెల్ , డీజల్ ధరలు తగ్గింపు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments