Election Results-2024,Theatres: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు.. ఎక్కడంటే!

Election Results-2024,Theatres: రేపటితో సార్వత్రిక ఎన్నికల సందడి ముగియనుంది. అనంతరం జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్దమయ్యాయి.

Election Results-2024,Theatres: రేపటితో సార్వత్రిక ఎన్నికల సందడి ముగియనుంది. అనంతరం జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్దమయ్యాయి.

భారత దేశంలో ఎన్నికల పండగ వాతావరణం కొనసాగుతోంది. దాదాపు నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఎన్నికల జాతర  ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విజయవంతంగా ఆరు విడుతల్లో పోలింగ్ పూర్తి కాగా.. రేపు(శనివారం)జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. దీంతో పూర్తి స్థాయిలో  దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తవుతాయి. ఇక దేశ ప్రజల కళ్లన్నీ ఎన్నికల ఫలితాలపైనే ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో అయితే దాదాపు 20 రోజుల పై నుంచే ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జూన్ 4వ  తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో  ఓ ప్రాంతంలోని థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రేపటితో సార్వత్రిక ఎన్నికల సందడి ముగియనుంది. శనివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. అనంతరం జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఫలితాల కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో సార్వత్రి ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక జూన్ 4న యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటంతో అందరి దృష్టి ఫలితాలపై ఉంది. ఈ క్రమంలోనే ఫలితాలను కొందరు ప్రొజెక్టర్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలను చూడాలని కోరుకునే వారికి కూడా ఆ ఛాన్స్ దక్కనుంది.

కొన్ని థియేటర్లు లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదులేండి. మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి. ముంబయి లోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లలో ఈ ఫలితాలు ప్రసారం చేయనున్నాయి. అలానే  ఠాణెలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ అనే థియేటర్లలో లోక్ సభ ఎన్నికలను ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నాయి. అలానే పుణెలోని మూవీమ్యాక్స్‌ తదితర థియేటర్లు జూన్‌ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారని సమాచారం.

ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల కౌంటింగ్ ను ఆరు గంటల పాటు థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక టికెట్ ధరలను కూడా నిర్ణయించారు. రూ.99 నుంచి రూ.300 వరకు టికెట్ ధరలను నిర్ణయించారు.  అలా ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న థియేటర్లలో ఇప్పటికే కొన్ని హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. తాము టికెట్ బుక్ చేసుకున్నట్లు కొందరు స్క్రీన్‌షాట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో వైరల్‌గా మారాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ అవకాశం ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Show comments