Narendra Modi: వృద్దురాలి కాళ్లకు నమస్కరించిన మోదీ.. వైరలవుతున్న ఫొటో

ప్రధాని నరేంద్ర మోదీ ఓ వృద్ధురాలి కాళ్లకు నమస్కారం చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఆ మహిళ ఎవరు.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..

ప్రధాని నరేంద్ర మోదీ ఓ వృద్ధురాలి కాళ్లకు నమస్కారం చేస్తున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఆ మహిళ ఎవరు.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివర దశకు చేరుకుంది. జూన్‌ 1న ఏడో విడత పోలింగ్‌ జరగనుంది. దాంతో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తవుతుంది. అదే రోజు సాయంత్రం.. ఎగ్జిట్‌ ఫలితాలు విడుదలవుతాయి. జూన్‌ 4న రిజల్ట్స్‌ వచ్చేస్తాయి. ఇక జూన్‌ 1 అనగా శనివారం నాడు.. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇక లోక్‌సభ ఎన్నికలకు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం నాడు ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకేరోజు 3 సభల్లో పాల్గొన్నారు. పదేళ్ల పాలనలో ఒడిశాలో బీజేడీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు నరేంద్ర మోదీ. జూన్‌ 4 తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతుందన్నారు మోదీ. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మహిళలను కలిశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ చేసిన పని అక్కడున్నవారందరని షాక్‌కు గురి చేసింది. సభకు హాజరైన వారిలో ఓ వృద్ధ మహిళా మద్దతురాలి పాదాలకు నమస్కరించాడు మోదీ. వృద్ధురాలిని ఓతల్లిలా భావించిన మోదీ.. ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఒక తల్లిలా ఆమె ప్రధాని మోదీని ఆశీర్వదించారు. ఈ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

మోదీ వృద్ధురాలి కాళ్లకు నమస్కరించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు మోదీ నమస్కరించిన మహిళ ఎవరంటే.. ఆమె పేరు కమలా మొహరానా. ఈమె గురించి మోదీ గతంలో మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈమె మోదీ కోసం ప్రత్యేకంగా రాఖీ తయారు చేసి మరీ పంపింది. ఇక ఆమె చెత్త నుంచి పనికి వచ్చే వస్తువులు తయారు చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

ఇక ఈ ఎన్నికల్లో తమ పార్టీ 400 సీట్ల వరకు సాధిస్తుందని బీజేపీ అగ్ర నేతలు అమిత్‌ షా, నరేంద్ర మోదీ నమ్మకంగా ఉన్నారు. ఇక ఆఖరి విడత పోలింగ్‌ శనివారం నాడు జరగనుంది. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుది. ఇక ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారం, సభలు, పర్యటనలతో బిజీబిజీగా గడిపిన నేతలందరూ నేటి సాయంత్రం నుంచి ఫ్రీ కానున్నారు. ఫలితాలు వెల్లడించే వరకు అనగా జూన్‌ 4 ముందు వరకు రిలాక్స్‌ అవుతారు.

ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా నేటి సాయంత్రం.. ఏపీకి రానున్నారు. తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి గాను అమిత్‌ షా ఏపీకి రాన్నున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అమిత్‌ షా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం.. 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి తిరిగి రాజ్‌కోట్‌ బయల్దేరి వెళ్తారని బీజేపీ వర్గాలు తెలిపారియ

Show comments